టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో సెకండ్ హీరోగా విశ్వంత్ వెండితెరకు పరిచయం అయ్యాడు. విశ్వంత్ పూర్తి పేరు విశ్వనాథ్. కాకినాడలోని సామర్లకోట లో పుట్టిన విశ్వంత్.. ఉన్నత చదువుల కోసం అమెరికా లో ఉన్న సమయంలో దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో నటించిన విశ్వంత్ కి మంచి పేరే వచ్చింది.
కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించే లేదు. విశ్వంత్ కి మాత్రం గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఈ యువ హీరో పై కేసు నమోదు కావటం ఇండస్ట్రీ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.
మేటర్ లోకి వెళ్తే తక్కువ ధరకు కార్లను ఇప్పిస్తానని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేయడం తో విశ్వంత్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. నమ్మించి మోసం చేశాడని తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.