NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అనంత నుండి కర్నూలుకి పొలిటికల్ వార్..! నేతల సవాళ్లుతో హీట్..!!

రాయలసీమలోని మరో నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే, టిడిపి ఇంచార్జ్ ల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు మొదలయ్యాయి.

ఇప్పటికే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాప్తాడు నియోజకవర్గాల్లో ఇదే తరహా వాతావరణం నెలకొని ఉన్న విషయం తెలిసిందే.తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వార్ జరుగుతోంది.ఒక సందర్భంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా ప్రభాకర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి హల్చల్ చేశారు.అలాగే రాప్తాడులో కూడా సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి,ఆ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మీద శ్రీరామ్ అనేక అవినీతి ఆరోపణలు చేశారు.దీనికి కౌంటర్ ఇస్తూ పరిటాల శ్రీరామ్ ని పరుష పదజాలంతో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఏకిపారేశారు. ఇప్పుడు కర్నూలు జిల్లా బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే తరహా రచ్చ మొదలైంది. టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి, బనగానపల్లె వైసిపి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలను విసురుకుంటున్నారు.

ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఈ ఇద్దరూ పాల్గొని బహిరంగ సవాళ్లు విసురుకున్నారు . తమపై వస్తున్న ఆరోపణలను ఎవరికి వారే ఖండిస్తూ ఓపెన్ డిబెట్‌కు సిద్దమని ప్రకటించారు.

జనార్దన్ రెడ్డి నేరస్థుడన్న ఎమ్మెల్యే!

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 22 కేసులలో నిందితుడని, అన్నింటికీ FIR చూపిస్తానని, భూ కబ్జాదారుడని ఆరోపించారు. బనగానపల్లెలోని ఆయన ఇల్లు కూడా కబ్జా చేసిందే అన్నారు. అలాంటి బీసీ జనార్దన్ రెడ్డికి నన్ను విమర్శించే అర్హత లేదని ఎగతాళి చేశారు.కత్తి పట్టుకుంటానని అంటున్న బీసీ జనార్దన్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడనని, అతడు చేసే అవినీతి అక్రమాలను నిరూపించేందుకు మీడియా సమక్షంలోనే డిబేట్‌కు సిద్ధమని ప్రకటించాడు.

ప్రభుత్వ స్థలాల్లో ఎమ్మెల్యే పాగా వేస్తున్నాడన్న జనార్దన్రెడ్డి!

ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడని ఆరోపించారు. ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌తో అతి ప్రాచీన ఆలయాలకు ముప్పు పొంచి ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమాలను ఎత్తిచూపిన వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఆయన అక్రమాలను నిరూపించడానికి తానూ డిబేట్‌కు సిద్ధమని ప్రకటించారు.వీరిద్దరి మధ్య మొదలైన ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి!

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N