NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

jagan : వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, నిమ్మగడ్డ ఓటమి కోసం జగన్ భారీ రిస్క్ ?

jagan mohan reddy : రాష్ట్ర ఎన్నిక సంఘంతో జగన్ మోహనరెడ్డి సర్కార్ తలపడటం ఇది రెండవ సారి. గత ఏడాది మొదట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా కారణం చూపుతూ ఎంపిటీసీ, జడ్‌పిటీసీ ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేశారు. ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడం సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నిమ్మగడ్డపై జగన్ నిప్పులు చెరిగారు. సామాజిక ప్రస్థావన కూడా తీసుకువచ్చి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆగిపోయిన ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ తొలుత హైకోర్టుకు, ఆ తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అయ్యింది.

jagan-not-to-mention-falling-behind-huge-risk-for-nimmagadda-defeat
jagan-not-to-mention-falling-behind-huge-risk-for-nimmagadda-defeat

ఆ కోపంతో నిమ్మగడ్డను ఇంటికి పంపడానికి స్కెచ్ సిద్ధం చేసిన జగన్ నేరుగా పంపించడం సాధ్యపడని భావించి పదవీ విరమణ అయిన న్యాయకోవిదుల సలహాలతో నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించి ఆయన స్థానంలో రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమించారు. ఆ  తరువాత పదవి పోగొట్టుకున్న నిమ్మగడ్డ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ ఫైట్ చేసి తన కుర్చీ మళ్లీ సాధించుకున్నారు. అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైరం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ సమ్మతి లేకుండా ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో జగన్ సర్కార్ మరో సారి ఎస్ఈసీపై డైరెక్ట్ ఫైట్ కు దిగింది. ఇప్పుడు కూడా సర్కార్ కు ఊహించని దెబ్బే ఎదురైంది. ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా అనేది పక్కన బెడితే జగన్మోహనరెడ్డి సర్కార్ ఎస్ఈసీ నిమ్మగడ్డతో జరిగిన పోరులో రెండవ సారి ఓడిపోయారు.

jagan-not-to-mention-falling-behind-huge-risk-for-nimmagadda-defeat
jagan-not-to-mention-falling-behind-huge-risk-for-nimmagadda-defeat

సుప్రీం ధర్మాసనం రాజ్యాంగ సంస్థ విధుల్లో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వంపై, ఉద్యోగ సంఘాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చేనని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అయితే ఇంత జరిగిన తరువాత వైసీపీ సైలెంట్ గా ఉంటుందా? రివేంజ్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేస్తుందా? చూడాలి మరి. గవర్నర్ ద్వాారా నిమ్మగడ్డ కు చెక్ చెప్పడానికి ఎమైనా అవకాశాలు ఉన్నాయేమో? అయితే ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నందున కరోనా వ్యాక్సినేషన్ సంగతి ఏమి చేయమంటారో సమాధానం చెప్పాలని కోరింది. కేంద్రం దీనిపై ఏమి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N