NewsOrbit
రాజ‌కీయాలు

BJP : ఉవ్వెత్తున ఉద్యమం… ఏది అ”మోదీ”యం?

BJP Emerging movement

BJP : రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ఎర్రకోట మీదకు వచ్చి రైతులు వారి పతాకాన్ని ఎగురవేయడంతో పాటు పోలీసుల మీదకు ట్రాక్టర్లతో దూసుకురావడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది… ఒక ఉద్యమం ఎప్పుడు అయితే హింసాత్మకంగా మారుతుందో అప్పుడు పాలకులకు ఆ ఉద్యమాన్ని అణచి వేయడం చాలా సులభం అవుతుంది… గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన కొన్ని కొన్ని హింసాత్మక సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం అవడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో… రైతు ఉద్యమం మీద దేశ ప్రజల ఆలోచనా తీరులో కాస్త మార్పు వచ్చింది. రైతు ఉద్యమం నాయకులు రైతులు ఇలా చేయారంటూ… దేశవ్యాప్తంగానే భిన్నమైన స్వరాలు వినిపించాయి. అయితే ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం మాత్రం ఏమాత్రం తొణకలేదు బెణకలేదు. అది మహోగ్ర రూపం దాల్చి ఇప్పుడు మోడీ సర్కార్ ను అతలా కుతలం చేస్తుంది. హింసాత్మక ఘటనలు సాకుగా చూపి రైతు ఉద్యమాన్ని నీరుగార్చారని అనుకున్న మోడీ సర్కార్ కు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

BJP Emerging movement
BJP Emerging movement

Bjp :ఉత్తరప్రదేశ్ కు పకడంతో!!

నిన్న మొన్నటి వరకు హర్యానా పంజాబ్ రాష్ట్రాలు కె పరిమితమైన రైతు ఉద్యమం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు పాకింది. రైతు ఉద్యమంలో కీలకంగా ఉండే ఉత్తరప్రదేశ్ రైతాంగం దీనిలో పాలుపంచుకోవడం రైతు ఉద్యమానికి మరింత వెన్నుదన్నుగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి భారీగా రైతులు రైతు ఉత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీ రావడంతో ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసి పోతున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ దీనిలో కల్పించడంతోపాటు రైతు ఉద్యమానికి ఇప్పుడు వారు చేసే ప్రసంగాలు ఆ నాయకులు చేసే ప్రోత్సాహం ఎక్కడలేని మద్దతును తీసుకొస్తోంది. రైతు చట్టాలను ఖచ్చితంగా రద్దు చేస్తామని హామీ ఇస్తేనే రైతు ఉద్యమాన్ని విరమిస్థామంటూ… రైతు సంఘాల నాయకులు తేల్చి చెప్పడంతో పాటు.. ఢిల్లీలో ఇప్పటి వరకు రైతుల్ని అడ్డుకుంటున్న పోలీసులు నుంచి సైతం రైతులకు సానుకూల మద్దతు లభిస్తోంది. తాజాగా పోలీసులు సైతం రైతుల ఉద్యమంలో న్యాయం ఉందని వారిపై తాము లాఠీఛార్జి చేయమంటూ.. చెబుతున్న వీడియో దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కేవలం పోలీసులు నుంచే కాకుండా ఢిల్లీలోని వివిధ వర్గాల నుంచి కూడా రైతులకు మద్దతు లభిస్తోంది. ఇటీవల సజత్ బోర్డర్ వద్ద స్థానికులు రైతులు ఖాళీ చేయమంటున్నారు అంటూ స్థానికులు చేత బిజెపి నాయకులు చేపించిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పాటు స్థానికుల నిరసనల వెనుక ఎవరు ఉన్నారు అనేదానిమీద బిజెపి నాయకుల పేర్లు బయటకు రావడంతో బిజెపి నాయకులు మిన్నకుండి పోతున్నారు.

రాకేష్ టికాయత్ రంగ ప్రవేశం!

ఉత్తరప్రదేశ్ రైతాంగ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన మహేంద్రసింగ్ టికాయత్ కొడుకు ప్రస్తుత భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు అయిన రాకేష్ టికాయత్ రైతాంగ ఉద్యమం లోకి రావడం తోనే రైతాంగ ఉద్యమం స్వరూపం మారిపోయింది. ఎన్నో రైతాంగ ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న ఈ రైతాంగ సంస్థ ఆధ్వర్యంలో రైతులంతా ఓ క్రమశిక్షణగా, ఓ పద్ధతి ప్రకారం పోరాటంలో ముందుకు నడిపిస్తున్నారు. పూర్తి శాంతియుతంగా సాగిస్తున్న వీరి పోరాటం… మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల మీద ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎప్పటి వరకు పంజాబ్ హర్యానా రైతులు మాత్రమే రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని వారు వ్యతిరేకించడంలో కూడా వెనుక చాలా శక్తులు పని చేస్తున్నాయి అంటూ విపరీతంగా ప్రచారం కల్పించిన బీజేపీ కు… ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రైతాంగం కూడా తోడు కావడంతో ఏం చేయాలనే దాని మీద సందిగ్ధం నెలకొంది. రైతు చట్టాల మీద మొండిగా వెళితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దెబ్బ పడితే బిజెపి ఇప్పట్లో కోల్పోలేదు. ఈ విషయాన్ని బిజెపి అధినాయకత్వం సైతం గుర్తించి… ప్రస్తుతం ప్రధాని మోడీ నోటి వెంబడి నుంచే రైతులతో చర్చిస్తామని ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరిస్తామని మాటలు వస్తున్నాయి. అసలు మొత్తం ఉద్యమాన్ని నీరుగార్చే… హింసాత్మక ముసుగు వేసి ఉద్యమాన్ని నీరుగార్చారని చూసిన బీజేపీ పెద్దలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిద్ర పట్టనివ్వని విధంగా తయారు అయ్యాయి.

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju