Balakrishna : నందమూరి బాలయ్య బాబు లెజెండ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు విజయాలు సాధించిన తర్వాత చేసిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా బాలయ్య బాబు భారీగా విజయం సాధించాలని ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా తీయగా రెండు భాగాలు కూడా నందమూరి అభిమానులను ఏ మాత్రం మెప్పించలేక ఫ్లాప్ అవ్వడం జరిగింది.
బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య Balakrishna
ఆ తర్వాత నటించిన రూలర్ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇలాంటి తరుణంలో బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య బాబు సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో బాలయ్య బాబు కి సంబంధించిన చిన్నపాటి వీడియో మరియు ఫోటోలు కచ్చితంగా సినిమా హిట్ అవడం గ్యారెంటీ అని, బోయపాటి హ్యాట్రిక్ కొట్టడం దాదాపు ఖరారైపోయింది అని నందమూరి అభిమానులు డిసైడ్ అయిపోయారు.
అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ బాలయ్యబాబు ఎవరితో చేస్తారన్న దానిపై రకరకాల వార్తలు మొన్నటిదాకా వినబడ్డాయి. చాలా మంది స్టార్ డైరెక్టర్ ల పేర్లు సోషల్మీడియాలో ఇండస్ట్రీ నుండి వినబడ్డాయి. కానీ తాజాగా మాత్రం క్రాక్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు జోరందుకున్నాయి. అదిరిపోయే మాస్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో బాలయ్యతో సినిమా చేస్తున్నట్టు అతి తక్కువ టైంలోనే సినిమా చేయాలని డైరెక్టర్ గోపీచంద్ తో ముందే మాట్లాడుకుని బాలయ్య..సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.