NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Council : ఫుల్ స్పీడ్ ఫ్యాన్ : సైకిల్ పూర్తి పంచర్!

AP Council : నిన్న మొన్నటి వరకు ఏపీ శాసన మండలి లో మెజారిటీ ఉందని టీడీపీ కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి అడ్డుపడింది. శాసన సభలో ఆమోదించిన బిల్లులను సైతం కొన్ని క్లాజులను చూపించి ఆలస్యం చేయగలిగింది. అయితే రాబోయే మూడు నెలల్లో ఆ పరిస్థితి ఇక ఉండకపోవచ్చు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడా అని ఆరాటపడుతున్న శాసనమండలి మెజారిటీ మరో మూడు నెలల్లో ఆ పార్టీకి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.

** ప్రస్తుతం శాసన మండలి శాసన మండలి లో ఆరు స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నికలు కొత్త చర్చలకు సమీకరణాలకు తెరలేపాయి. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో మూడు తెలుగుదేశం పార్టీ కాగా మరో మూడు వైసీపీ వి. వైయస్సార్ సిపి కి ఉన్న బలాన్ని చూస్తే మొత్తం ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండటంతో తన పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు ప్రకటించారు. మార్చి 15వ తేదీన జరిగే ఎన్నికల్లో వీరి విజయం లాంఛనమే. అదే నెల 29వ తేదీన వారు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

** ప్రస్తుతం శాసన మండలి ఎన్నికలు ఎమ్మెల్యేలకు జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో మళ్లీ శాసనమండలి ఎన్నికలు రాబోతున్నాయి. శాసనసభ్యుల కోటా లో మరో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. టిడిపికి చెందిన ఎమ్మెల్యే షరీఫ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసిపి సభ్యుడు దేవ సాని చిన్న గోవిందరెడ్డి పదవీకాలం ఈ ఏడాది మే 24 వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలు సైతం అధికార పార్టీ ఖాతాలో చేరూతాయి.

** ఈ ఏడాది జూన్ 18వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఇప్పటికే మూడు స్థానాలు ఖాళీగా ఉంటే ఏడుగురు టిడిపి సభ్యులు, ఒక వైసీపీ సభ్యుల పదవీకాలం అప్పటి తో ముగుస్తుంది. టీడీపీకి చెందిన ద్వారపూడి జగదీశ్వరరావు, గాలి సరస్వతి, రెడ్డి సుబ్రమణ్యం, బుద్ధ వెంకన్న, వై వి బాబు రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతిరావు, నాగ జగదీశ్వరరావు లతో పాటు వైసీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం జూన్ 18న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ తో గెలిచాడు అధికార పార్టీ ఈ 11 స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుని అవకాశం కనిపిస్తోంది.

** గవర్నర్ కోటాలో శాసనమండలికి 8 స్థానాలు ఉన్నాయి. దీనిలో నాలుగు స్థానాలు ఈ ఏడాది జూన్ 18న కాళీ కాబోతున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన పమిడి సమంతకమని, టిడిపి కుప్పం నాయకుడు గౌనివారి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా నుంచి బీదా రవిచంద్ర, టిడి జనార్దన్ శాసనమండలి నుంచి బయటికి రాబోతున్నారు. ఈ నలుగురి స్థానంలో ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు కొత్తవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు. దీంతో జూన్ చివరి నాటికి వైసిపికి శాసనమండలిలో పూర్తిస్థాయి అధిపత్యం లభించే అవకాశం కనిపిస్తోంది.

** పెద్దల సభలో పూర్తిస్థాయిలో 58 స్థానాలు ఉన్నాయి. దీనిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల తరఫునుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు, ఎమ్మెల్యేల కోటాలో వచ్చేవారు మొత్తం అంతా కలిసి ఉంటారు. జూన్ చివరి నాటికి శాసనమండలిలో 34 ప్రాణాలు వైసీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ బలం 14 పడిపోతుంది. ఉపాధ్యాయ సంఘం పిడిఎఫ్ తరఫున ఐదుగురు, బిజెపి తరఫున ఇద్దరు, మరో ముగ్గురు స్వతంత్రులు శాసనమండలికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. 2023 మార్చి నాటికి నారా లోకేష్ పదవీకాలం ముగుస్తుంది. అప్పుడు ఆ స్థానం సైతం అధికార పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?