NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vellampalli Srinivas : వైసిపి గొంతులో వెలక్కాయ గా మారిన మంత్రి వెల్లంపల్లి?సహచరులే తలలు పట్టుకుంటున్న వైనం!

Vellampalli Srinivas : ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పదుడైన మినిస్టర్ గా తయారవడంతో అధికార పార్టీలోనే ఆయనపై అసంతృప్తి వ్యక్తమవుతోందని వైసిపి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.సహచర మంత్రులే వెల్లంపల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరచూ వివాదాలు ఏంటంటూ వెల్లంపల్లికి క్లాస్ పీకారని కూడా వారు చెప్పుకుంటున్నారు.ఇంతకీ వెల్లంపల్లిపై సీనియర్‌ మంత్రులు ఎందుకు ఆగ్రహం ఉన్నారంటే…?

Headache In YSRCP Because Of Vellampalli Srinivas
Headache In YSRCP Because Of Vellampalli Srinivas

ఎటు చూసినా వివాదాలే!

మంత్రి వెల్లంపల్లి చుట్టూ వివాదాలే.. అటు పొలిటికల్ సైడ్.. ఇటు డిపార్ట్మెంట్ సైడ్ మంత్రికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై దాడులు జరుగుతుండటం.. వాటిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహం ధ్వంసం సందర్బంలో అక్కడికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లి నేరుగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసి చులకనగా మాట్లాడటం తో పాటు పలు ఆరోపణలు చేయడంతో క్షత్రియులు మంత్రికి వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో మంత్రి మరిన్ని వివాదాల్లో కూరుకుపోవడ౦ పార్టీకి ఇబ్బందిగా తయారయింది.

వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు!

ముందు నుంచీ ప్రతిపక్షాలు వెల్లంపల్లిని టార్గెట్ చేశాయి. ఒక పక్క టీడీపీ, మరోపక్క జనసేన, బీజేపీ దొరికినప్పుడల్లా మంత్రిపై గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మంత్రి చుట్టూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి చుట్టూ అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దుర్గగుడిలో అవినీతితో సహా నగరంలో అనేక అంశాల్లో మంత్రి ప్రధాన అనుచరులు ఉన్నట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే సొంత పార్టీలోనే వెల్లంపల్లి తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చాలామంది పార్టీ నేతలతో పాటు మంత్రులు వెల్లంపల్లి తరచుగా వివాదాల్లోకి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఆయన చుట్టూ వచ్చే అవినీతి ఆరోపణలపై కొందరు సీనియర్ మంత్రులు నేరుగా పిలిచి క్లాస్ తీసుకున్నరని కూడ తెలుస్తోంది. ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని.. ప్రభుత్వానికి, మిగతా మంత్రులకు చెడ్డ పేరు వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోనూ అవినీతి ఆరోపణలపై వెల్లంపల్లిని మందలించారట సీనియర్ మంత్రులు. జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవని కూడా చెప్పేశారట. మరి చూడాలి నెక్స్ట్‌ సీన్‌ ఏంటనేది..!

 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N