NewsOrbit
న్యూస్

West Bengal : పశ్చిమ బెంగాల్ సీఎం దీదీకి గాయాలు.. కోల్‌కతా ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలింపు

West Bengal : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ)కి గాయాలు అయ్యాయి. నందిగ్రామ్ ఎన్నికల ప్రచార ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆమె కాలికి గాయం అయ్యింది. తాను కారు వద్ద నిల్చుని ఉండగా కొందరు వ్యక్తులు కారు డోర్ ను బలంగా తోయడంతో కాలికి బలమైన గాయం అయ్యిందని మమత పేర్కొంటున్నారు. గాయం వల్ల కాలుకు వాపు వచ్చిందన్నారు. తనపై దాడి వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు దీదీ. తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులు ఎవరూ తన చుట్టూ లేరని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. గాయపడిన దీదీని పార్టీ శ్రేణులు హుటాహుటిన కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు.

West Bengal attack on Mamata Banerjee at Nandi gram
West Bengal attack on Mamata Banerjee at Nandi gram

మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నందిగ్రామ్ వెళ్లారు. ఈ రోజు ఉదయం వివిధ దేవాలయాల్లో పూజల తరువాత హల్దియాలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ రాత్రికి నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఉండి గురువారం ఉదయం కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. అయితే మమతకు గాయాలు కావడంతో భద్రతా సిబ్బంది కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. నందిగ్రామ్ నుండి బీజెపీ తరపున సువేంద అధికారి పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మమత బెనర్జీపై దాడి జరగడం కల్పితమని, ఇది ఆమె ఆడుతున్న నాటకంగా బీజెపీ పేర్కొంటోంది. ఎన్నికల్లో పోటీ పడటానికి భయపడి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజెపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju