NewsOrbit
Featured Horoscope

Today Horoscope మార్చి-12 – మాఘమాసం – శుక్రవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 12 – మాఘమాసం – శుక్రవారం.

మేష రాశి Today Horoscope మార్చి-12 – మాఘమాసం – శుక్రవారం. వ్యాపారాల్లో అనుకూలత !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణబాధలు పెరిగిపోతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. విలువైన ఆభరణాలు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో అనుకూలత లోపించి స్వల్ప నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి.

వృషభ రాశి : అందరినీ ఆకట్టుకుంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు, వారి కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న ఫలితాలను పొందుతారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి : అనవసరపు స్నేహాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. సమయానికి చేతికి డబ్బులు అందక అనవసరపు ఖర్చులు ఎక్కువై ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఆచార సంప్రదాయాలను మరచిపోతారు. విద్యార్థులు అనవసరపు స్నేహాలను పెంచుకొని చదువుని నిర్లక్ష్యం చేస్తారు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేయండి.

కర్కాటక రాశి : సంతోషంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. గతంలో గొడవ పడిన వారు కలుసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు ఓర్పు సహనంతో ఎంత కష్టమైన పనినైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
రెమిడీః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

Today Horoscope
Today Horoscope

సింహరాశి : వ్యాపారాల్లో ఒడిదుడుకులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసే ప్రాణ స్నేహితులు దూరం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి : శ్రమకు తగ్గ ఫలితం !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కార్యాలయాల్లో పదోన్నతులు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
రెమిడీః ఈరోజు లక్ష్మి కుబేర స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి : రుణ బాధలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. తొందరపడి ఇతరుల మాటలను నమ్మడం వల్ల మోసపోతారు. స్థిరాస్తులు అనుకూలించవు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. శ్రమ ఎక్కువ అవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. మానసిక వేదనకు గురవుతారు. విద్యార్థులు ఒత్తిడికి గురై చదువును నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి  : ఆకస్మిక స్థల మార్పిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల అనర్ధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయం ఆకస్మిక స్థల మార్పిడి జరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప లాభాలు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి.
రెమిడీః ఈరోజు ముక్తేశ్వరని ఆరాధించండి.

ధనస్సు : ప్రయాణ నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలు కాక రుణబాధలు పెరిగిపోయి. ఆర్ధిక నష్టం జరుగుతుంది. ఇష్టపడేవారు దూరమవుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. ప్రయాణ నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల పట్ల అభిప్రాయబేధాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి : కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కోసం కంటే ఎదుటివారి కోసం బాగా కష్ట పడతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. డబ్బులు సంపాదించాలని తపన పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి : అధికారుల ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్త. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
రెమిడీః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి : లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీలో ఉన్న పట్టుదల వల్ల చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. ఎదుటివారితో సేవ చేయించుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. డబ్బు సంపాదించాలని శ్రమ పడతారు. మీలో ఉన్న మంచి స్వభావం వల్ల ఎదుటి వారిని అర్థం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.
రెమిడీః ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju