NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 27 – ఫాల్గుణమాసం – శనివారం.

మేష రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.రుణ బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. పనులు వాయిదా పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్త్రీలకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రశాంతత కోల్పోతారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు.
రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. మీలో దైవభక్తి ఏర్పడుతుంది. సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు. నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.తోటి ఉద్యోగులతో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబంలో సమస్యలు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. స్త్రీలకు పని ఒత్తిడి అధికమై ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.పుట్టింటి నుంచి శుభవార్తలు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. సమాజ సేవ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
రెమిడీః శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 27
today horoscope in telugu march 27

సింహరాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మనోవేదనకు గురవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి. వ్యాపారాల్లో ఆటంకాలు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ప్రయాణ ఇబ్బందులు. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. నీటి సంబంధం ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.వచ్చిన అవకాశాలను అందుకుంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అధిక లాభాలు పొందుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.
రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు సంతోషకరంగా లేదు. ధననష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నష్టం. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చు కోలేక మనోవేదనకు గురవుతారు. అనవసరపు ఖర్చులను ఎక్కువ చేస్తారు. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అవుతుంది. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు. విద్యార్థులు పెద్ద వారు చెప్పిన మాటలను పట్టించుకోక చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః దుర్గా దేవిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు.
రెమిడీః శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ధననష్టం !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. విలువైన వస్తువులు ఎక్కడైనా పోగొట్టుకుంటారు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఇష్టపడే వారు దూరమవుతారు. విద్యార్థులు అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఎదుటివారి కోసం కష్ట పడతారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యత గా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు పెద్దవారిని గౌరవిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. తెలియని విషయాలను తెలుసుకుంటారు.
రెమిడీః కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.బంధువుల మధ్య విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో సఖ్యత కోల్పోతారు. సహాయం చేసే వారిని దూరం చేసుకుంటారు. బంధువుల మధ్య విభేదాలు. కార్యాలయాల్లో సమయపాలన పాటించండి. పై అధికారుల ఆగ్రహానికి లోనవుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శివారాధన చేయండి.

మీన రాశి Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ధన వృద్ధి !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. నూతన వ్యక్తులను కలుసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రాజెక్టు వర్కులు చేపడతారు. వ్యాపారాల్లో ధన వృద్ధి కలుగుతుంది. కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి.
రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju