NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Note for Vote : చంద్రబాబు ఫోన్ చేసింది నిజమేనంటున్న స్టీఫెన్ సన్..! మరి..

stephenson on chandrababu phone call

Note for Vote : ఓటుకు నోటు Note for Vote కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2015 మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అప్పటికి ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు పేరు ఈ కేసులో ఉండటం మరింత సంచలనం రేపింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మద్దతు కోరుతూ అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అప్పటినుంచీ ఈ కేసుపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా స్టీఫెన్ సన్ ఏసీబీ కోర్టులో విచారణ నిమిత్తం హాజరయ్యారు.

stephenson on chandrababu phone call Note for Vote
stephenson on chandrababu phone call Note for Vote

తనతో చంద్రబాబు మొబైల్ ఫోన్లో మాట్లాడటం నిజమేనని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. మనవాళ్లు అంతా బ్రీఫ్ చేసినట్టు చెప్పారని.. వాళ్లు చెప్పినట్టు చేయాలనీ.. మిగిలిన విషయాలు తాను చూసుకుంటానని చెప్పినట్టు కోర్టుకు తెలిపారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని కోరారని కూడా చెప్పారు. మరికొందరి వాదనలు కూడా విన్న కోర్టు ఈ కేసును ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. ఈ కేసులో ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహ తదితరులను విచారించడం, రిమాండ్ కు పంపడం.. వాళ్లు బెయిల్ పై బయటకు రావడం కూడా జరిగింది. అయితే.. ఇన్నేళ్లుగా ఈ కేసులో చంద్రబాబు నాయుడును కోర్టు ఇంతవరకూ విచారణకు పిలవలేదు.

తన ప్రమేయం లేదని గతంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని ఏసీబీ గతంలోనే తేల్చింది. చంద్రబాబు-స్టీఫెన్ సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా పూణెలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిజమేనని తేల్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏసీబీ చెప్పిన విషయం నిజమేనని పలుమార్లు గతంలో చెప్పారు కూడా. అయినా.. ఈ కేసులో విచారణకు సబంధమున్న ప్రతిఒక్కరినీ పిలిచి విచారించింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో వివరణ ఇవ్వాల్సిన వారిలో చంద్రబాబు ఉన్నారు. మరి.. నిన్న స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈనెల 7న ఏసీబీ కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?