NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : చాన్సే లేదు… మోడీకే డైరెక్టుగా ఆ మాట చెప్పిన జ‌గ‌న్‌

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ మ‌రోమారు త‌న వైఖ‌రిని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న‌ట్లే… ఏపీలో కూడా అదే ప‌రిస్థితి. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను క‌రోనా వ్యాక్సిన్ డోస్‌ల కొర‌త వేధిస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా కేంద్రానికి ఏపీ స‌ర్కార్ లేఖలు రాసింది. ఇదే ఒర‌వ‌డిలో తాజాగా ఏపీ సీఎం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

YS Jagan ఏపీలో ఇది ప‌రిస్థితి…

వాస్త‌వంగా ఏపీలో మూ రోజుల క్రిత‌మే కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ‌లు జీరోకు ప‌డిపోయాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి 60 లక్షల కోవిడ్ డోసులు కావాలని లేఖలో విఙప్తి చేశారు.. 60 లక్షల డోసులు ఇస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ మొదటి డోసును మూడు వారాల్లో పూర్తి చేస్తామ‌ని ప్ర‌ధాని రాసిన లేఖ‌లో పేర్కొన్న సీఎం జ‌గ‌న్.. ఒకే రోజులో రాష్ట్రంలో 6, 28, 961 మందికి వ్యాక్సినేషన్ చేశామ‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలాఉండ‌గా, నేడు 6 ల‌క్ష‌ల డోసులు రాష్ట్రానికి రానున్నాయి.

లాక్ డౌన్ సంగ‌తేంటి?

మ‌రోవైపు కోవిడ్ 19 నియంత్రణ, నివారణ, కోవిడ్‌ వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై సీఎం జ‌గ‌న్‌ కీల‌క సూచ‌న‌లు చేశారు. కోవిడ్‌ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి. కోవిడ్‌ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పని చేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వ‌చ్చింద‌న్నారు. వాక్సినేషన్‌ అనేది శాశ్వత పరిష్కారం అని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు.. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు అన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju