NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కెసిఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి ఫిదా అయిన బీజేపీ నేతలు

KCR : తెలంగాణలో గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉప్పు, నిప్పుగా ఉండే పరిస్థితి. అయినప్పటికీ ఓ విషయంలో బీజెపీ నేతల ప్రతిపాదనకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లు ఆమోదించడంతో బీజేపీ నేతలు ఫిదా అయి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

KCR humanity decision
KCR humanity decision

KCR : మేము పోటీ పెట్టం

ఇంతకూ విషయం ఏమిటంటే…ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆకాల మృతి చెందారు. ఈ డివిజన్ కు ఈ నెల 30వ తేదీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ దివంగత కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కుమారుడిని కార్పోరేటర్ టికెట్ ఖరారు చేసింది.

అయితే బీజేపీ గెలుచుకున్న ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు గానూ ఆ పార్టీ నేతలు అధికార టీఎస్ఎస్ ను సంప్రదించాలని భావించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం శుక్రవారం ప్రగతి భవన్ కు వెళ్లి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ను కలిసి విషయాన్ని తెలియజేశారు.కేటిఆర్ ను కలిసిన వారిలో ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, దివంగత రమేష్ గౌడ్ సతీమణి , కుమారులు, ఇరు పార్టీల నాయకులు ఉన్నారు.

ఈ సందర్భంలో కేటిఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయకముందే రమేష్ గౌడ్ మృతి చెందడం దురదృష్టకరమని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దని వచ్చిన ప్రతిపాదనను పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ప్రతిపాదనకు సమ్మతించారనీ తెలిపారు. మనవతా దృక్పదంతో ఈ నిర్ణయం తీసుకున్న టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లకు బీజేపీ ప్రతినిధి బృందం, రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju