Tollywood:టాలీవుడ్ Tollywood దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తోంది. సెకండ్ వేవ్ మరీ ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు కూడా. రోజువారీ కేసులు వేల నుంచి లక్ష.. అక్కడి నుంచి రెండు లక్షలకు పెరిగిపోవడానికి రోజుల సమయం మాత్రమే తీసుకోవడం కోవిడ్ తీవ్రతను సూచిస్తోంది. ఇంతటి తీవ్రతలో కూడా పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఫస్ట్ వేవ్ నుంచి కోలుకున్న తర్వాత టాలీవుడ్ బాగానే పుంజుకుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ ప్రతి నెలా ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, ధియేటర్లు పుంజుకునేలా చేసింది. సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందని ప్రూవ్ అయింది. అయితే.. సెకండ్ వేవ్ మళ్లీ వీరిలో ఆందోళన కలిగిస్తోంది.
పోయిన శుక్రవారం ధియేటర్లలోకి వకీల్ సాబ్ వచ్చే సమయానికే కోవిడ్ తీవ్ర రూపం సంతరించుకుంది. అయినా.. ధియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ ప్రభంజనం కొనసాగింది. స్టార్ హీరో కావడం, పవన్ క్రేజ్ దృష్ట్యా ప్రేక్షకులు ధియేటర్లలో పోటెత్తారు. వారం రోజుల్లో వకీల్ సాబ్ 100 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఈ శుక్రవారం ధియేటర్లలో రాజశేఖర్ సినిమా దెయ్యం.. ఏఆర్ రెహమాన్ నిర్మాతగా తెరకెక్కించిన 99 సాంగ్స్ సినిమాలు వచ్చాయి. కానీ.. పబ్లిసిటీ, కరోనా, స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఆశించిన రన్ తొలిరోజే లేకపోయింది. పవన్ క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. కరోనా వేవ్ వల్ల నాని.. టక్ జగదీశ్, నాగచైతన్య లవ్ స్టోరీ వాయిదా పడ్డాయి.
అయితే.. ప్రస్తుత కరోనా ప్రచండ వేగానికి టాలీవుడ్ లో కొత్త భయాలు లేకపోలేదు. గతేడాది సినిమాల నిర్మాణాలూ ఆగిపోయాయి.. రిలీజ్ ల ప్రస్తావనే లేదు. కానీ.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప, కేజీఎఫ్2, సలార్, ఆదిపురుష్ వంటి సినిమాలే కాకుండా చిన్న, మీడియం రేంజ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో చెప్పలేని పరిస్థితి. షూటింగ్ పూర్తైపోతే విడుదల చేసేందుకు డేట్ల సమస్య. ప్రస్తుత వేవ్ లో కూడా వకీల్ సాబ్ గట్టెక్కేసింది. వారంలో కేసులు మరింత ఎక్కువయ్యాయి. మరి పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!