NewsOrbit
న్యూస్ హెల్త్

6 నెలల మీ పిల్లలకు ఈ ఆహారం ఇవ్వండి!!

6 నెలల మీ పిల్లలకు ఈ ఆహారం ఇవ్వండి!!

Infants: పిల్లలు బరువు పెరగడానికి కావాల్సిన ఆహారాలు గురించి తెలుసుకుందాం ..
6 నెలల లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం. వాటిని మించినది  ఈ ప్రపంచం లో నే లేదు అంటే అర్ధం చేసుకోవాలి వాటి  విలువ. ఏదైనా అనారోగ్యం తో  ఉండి పాలు పట్టలేకపోతే చేసేది ఏమి లేదుకానీ.. ఆరోగ్యం బాగుంటే మాత్రం పాలు  పట్టకుండా మాత్రం ఉండకండి. తల్లి పాలు మించిన పోషక ఆహారం పిల్లలకు ఇంకొకటి లేదు. తల్లి బాదం పప్పు, తృణ ధాన్యాలు, గింజలు వంటివి తినడం ద్వారా పాల నాణ్యత మెరుగ్గా ఉండి పిల్లలకు మరింత పౌష్టికాహారం లభించినట్టవుతుంది. 6 నెలల తరువాత  మాత్రం సెమి సాలిడ్ ఆహారం ఇవ్వడం ప్రారంభించవచ్చు.

best food for infants for weight gain
best food for infants for weight gain

అరటి  పండ్లు సహజంగానే రుచిగా ఉంటాయి కాబట్టి  పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.అరటి పండ్లు సులువుగా దొరుకుతాయి. పిల్లలకి అరటి పండును గుజ్జులా చేసి లేదా  లేదా పాలల్లో కలిపి జ్యూస్ చేసి పెట్టవచ్చు.పిల్లల బరువు పెరగడం లో  నెయ్యి బాగా ఉపయోగపడుతుంది.  నెయ్యిలో కొవ్వు విలువలు మరియు పోషక విలువలు పుష్కలం గా ఉంటాయి . నెయ్యి వలన మెదడు చురుకుగా పని చేస్తుంది  అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. కానీ కొంత మంది పిల్లలకు నెయ్యి పడదు.

మొదటి సారి మీ బిడ్డకు నెయ్యి పెట్టినప్పుడు ఒంటి మీద ఎలర్జీ ఏమైనా  వచ్చాయేమో చూడండి. వచ్చుంటే మాత్రం నెయ్యిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది.రోజు ఆహారంలో  పెరుగుని ఇవ్వడం వలన పిల్లలలో    బరువుతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. విరోచనాలు, అజీర్తి వంటి వాటి నుండి కూడా కాపాడుతుంది. ప్రోటీన్, కాల్షియం మరియు ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆసిడ్స్ కంది  పప్పు లో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లలకు మెత్తగా ఉడికించి  తినిపించవచ్చు.పప్పును పెరుగులో కలిపి తే మాత్రం వాటి  పోషక విలువలు తగ్గిపోతాయి.

బంగాళదుంప లో  అత్యధికంగా పిండి పదార్థం ఉన్న కారణంగా వీటిని పెడితే  పిల్లలు త్వరగా బరువు పెరుగుతారు. కాని వీటిని వేపకుండా ఉడకబెట్టుకుని తింటే మంచిది. అల చేస్తే పిల్లలకు సులువుగా జీర్ణం అవుతుంది, అధిక నూనె లేకపోవడం వలన ఇతర సమస్యలు కూడా రావు.

వోట్స్ మరియు రాగి తక్కువ ధరలో దొరికే అత్యధిక పౌష్టికాహారం. వోట్స్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన  అది మలబద్ధకం మరియు అజీర్తి సమస్యలు రాకుండా చేస్తుంది. అందులో ఉండే విలువలు పిల్లల బరువు పెరిగేలా చేస్తుంది . రాగి సంగతి చెప్పనవసరం లేదు. ఇందులో ఐరన్, ప్రోటీన్, పీచు పదార్థం, మరెన్నో పోషక విలువలు ఉంటాయి. పిల్లలకు రాగి తినిపిస్తే వారి శరీరం గట్టి పడడం తో పాటు  బరువు కూడా పెరుగుతారు.

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N