NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Raghuramakrishna raju: రఘురామ సందేశమేంటి..? మళ్లీ మీసం ఎందుకు మెలేసినట్టు..?

raghuramakrishna raju acts creating sensation

Raghuramakrishna raju: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు Raghuramakrishna raju అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యాఖ్యలు, కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన అరెస్టయినా.. అసలు విషయం పక్కకు వెళ్లిపోయి.. ఆయన్ను కస్టడీలో పోలీసులు కొట్టారా? లేదా? అనే అంశం హైలైట్ అయింది. దీనిపై సీల్డ్ కవర్ లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఇక్కడో ఆసక్తికర సంఘటన జరిగింది. రఘురామ మళ్లీ మీసం మెలేశారు. ఇటివల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల సందర్బంలో మీసం మెలేశారు. ఇప్పడు మళ్లీ హైదరాబాద్ వెళ్తూ మీసం మెలేశారు.

raghuramakrishna raju acts creating sensation
raghuramakrishna raju acts creating sensation

రఘురామకృష్ణ రాజును హైదరాబాద్‌కు తరలిస్తున్న సందర్భంలో ఆయన కారులో ఉన్నంత సేపు తన మీసంపై చేయి ఉంచారు. పలు సందర్భాల్లో మీడియా కెమెరాలు కనిపించగానే మీసాన్ని తిప్పుతూనే కనిపించారు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. రఘురామ మళ్లీ ఇలా మీసం మెలేయడం వెనక ఉద్దేశం ఏంటనే ఊహాగానాలు వస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్ నుంచి రమేశ్ హాస్పిటల్ కు కాకుండా జైలుకు తరలించారు. అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఆయన్ను ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలన్నా సాధ్యం కాలేదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారా.. లేక తాను నైతిక విజయం సాధించాననే సంకేతమా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?
MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?

ప్రస్తుత చర్యలతో తాను బలహీనపడలేదని.. తాను ధైర్యవంతుడినని చెప్పడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని చెప్పాలి. అయితే.. రఘురామ కాలికి గాయాల అంశం ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టులో తేలిపోతుంది. కానీ.. ఈ సమయంలో ఆయన సంపాదించాల్సిన నైతిక మద్దతు మాత్రం ఏవైపు నుంచీ దక్కదనే చెప్పాలి. ఇలా చేయడం వల్ల రఘురామ ప్రభుత్వంపై, కులాలపై కావాలనే వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాల్ని రేకెత్తించడమే అవుతుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఆర్మీ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్ల మధ్య ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju