NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Aanandhayya: ఆనందయ్య మందుపై తెలంగాణ ఎమ్మెల్యే ఆగ్రహావేశాలు! అది వాడితే కళ్లమంటలు తప్ప కరోనా తగ్గదని వెల్లడి

Aanandhayya: కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ట్రెండింగ్ టాపిక్.కరోనా నిరోధానికే కాకుండా ఆ వ్యాధి సోకిన వారికి చికిత్సకు కూడా ఈ మందును ఇస్తుండటం, అది సత్ఫలితాలనివ్వడం అందరికీ తెలిసిందే.

telangana mla outraged over anandayya medicine
telangana mla outraged over anandayya medicine

దాదాపు ఇరవై అయిదు వేల మంది ఈ మందును తీసుకున్నారు .ఏ ఒక్కరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగలేదు. కారణాలేవైనప్పటికీ ఒక్కసారిగా నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఈ మందు పై ఫోకస్ పెట్టింది.తదుపరి పరిణామాల్లో ఆ మందు తయారీ నిలిచిపోయింది.అయితే ఇప్పటికీ ప్రజల నుండి, పలు రాజకీయ పార్టీల నుండి తక్షణమే ఈ మందు పంపిణీని పునరుద్ధరించాలని డిమాండ్లు వస్తున్న తరుణంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒకరు ఆనందయ్య తయారుచేసిన ఔషధంపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.

జరాభద్రం అని చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే!

కరీంనగర్ జిల్లా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వృత్తిరీత్యా డాక్టర్ కూడా! ఎమ్మెల్యేగా గెలవకముందు ఆయన అక్కడ ప్రఖ్యాత నేత్ర వైద్యుడు.జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం పరామర్శించారు.ఈ సందర్బంగా ఆయన ఆనందయ్య మందుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.తనకు బాగా తెలిసిన ఒకరికి కరోనా సోకగా వారి కుటుంబసభ్యులు కృష్ణ పట్నం వెళ్ళి ఆనందయ్య మందులు తెచ్చి సదరు రోగికి వాడారని,అయితే అదే పని చేయలేదని ఎమ్మెల్యే చెప్పారు.

ఆనందయ్య ఇచ్చిన మందును రోగి కళ్లలో పోయగా కరోనా తగ్గడం అటుంచి అతను ఆ రాత్రంతా కళ్లమంటలు అంటూ కేకలు పెట్టాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.”ఎమ్మెల్యేగానే కాకుండా ఒక డాక్టర్ గా కూడా చెబుతున్నాను.. ఆనందయ్య మందు కరోనాను తగ్గించదు. అలాంటి నాటు మందులు ,పద్ధతులను ఇప్పుడు కూడా ప్రజలు నమ్మడం మంచిది కాదు”అని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆ ముందు గనుక పనిచేసి ఉంటే తానే తెప్పించి జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కరోనా రోగులందరికీ వేయించి ఉండేవాడినని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు.ఆనందయ్య మందుకే అంత శక్తి ఉంటే ఇంతగా డాక్టర్లు, వైద్యసిబ్బంది ,ప్రభుత్వం హైరానా పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మకుండా శాస్త్రీయ పద్ధతుల్లో జరిగే చికిత్సను ఉంది ఆరోగ్యవంతులు కావాలని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు.

 

 

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?