NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatala Rajender: జ్వరంతో ఈటల అస్వస్థత..! పాదయాత్రకు బ్రేక్..!!

Eatala Rajender: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైయ్యారు.  దీంతో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజా దీవెన పేరుతో ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన పాదయాత్రలో భాగంగా 12వ రోజు ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగా వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహించగా తీవ్ర జ్వరం ఉండటంతో పాటు లోబీపీ, షుగర్ లెవల్స్ పెరగడాన్ని గమనించారు. ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.

Eatala Rajender is ill
Eatala Rajender is ill

వైద్యుల సూచనల మేరకు ఈటలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటల పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడటంతో ఈటల రాజేందర్ కు బదులు ఆయన సతీమణి జమున పాదయాత్ర కొనసాగించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈటల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ.. ఈటల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈటల రాజేందర్ ఈ నెల 19వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం నుండి ప్రజా దీవెన పాదయాత్రను ప్రారంభించారు. నేటి వరకూ 222 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju