NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: హుజూరాబాద్ ఎన్నికల బరిలో మరో విద్యార్థి విభాగం నేత..!!

Huzurabad By Poll: హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనుండగా, కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హూజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ పడుతుండగా, టీఆర్ఎస్ తరపున విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుండే టీఆర్ఎస్, బీజేపీ నేతలు నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఈటల రాజేందర్ ను ఎలాగైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.

congress party annoucued balmoori venkat candidate for Huzurabad By Poll
congress party annoucued balmoori venkat candidate for Huzurabad By Poll

Huzurabad By Poll: ఈటల వర్సెస్ కేసిఆర్ గా రసవత్తర పోటీ

మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యతలతో నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క ఈటల రాజేందర్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచరాం నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గంలో కేసిఆర్ ను, టీఆర్ఎస్ ను టార్గెట్ గా చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కేసిఆర్ వర్సెస్ ఈటల గా నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొని ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నర్శింహరావు బల్మూరిని హూజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి దింపింది. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకట్ బల్మూరి ఇటీవల కాలంలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో ముందు నిలిచి పోరాడుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు.

ఎన్ఎస్ యూఐ నేత వెంకట్ బల్మూరు

హూజూరాబాద్ అభ్యర్థిపై పార్టీలో తీవ్ర చర్చ జరగ్గా, వెంకట్ బల్మూరి పేరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమర్థించడంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సిఫార్సుతో ఏఐసీసీ వెంకట్ పేరను ఖరారు చేసింది. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ విద్యార్ధి నాయకుడు పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ఎస్ యుఐకి రెండు పర్యాయాలుగా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యార్ధి విభాగం నేత బల్మూరు వెంకట్ ను దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ ల దాఖలు గడువు ఈ నెల 8వ తేదీ వరకూ ఉంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N