NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Anil kumar Yadav: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వ్యాఖ్యలకు ఏపి మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్..! మామూలుగా లేదుగా..

AP Minister Anil kumar Yadav: ఏపిలో ఇటీవల వరదలకు కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ బాధ్యత రాష్ట్రానిది కాదా అని నిలదీశారు. ఆనకట్టల భద్రత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి షెకావత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు స్పిల్ వే తో పాటు గేట్లు మొత్తం తెరిచి వచ్చిన వరద వచ్చినట్లు బయటకు పంపాల్సింది కానీ అక్కడ డ్యామ్ కు ఉన్న అయిదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు, ఎందుకంటే అది పని చేయడం లేదు. దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

AP Minister Anil kumar Yadav: అవగాహన రాహిత్యంతోనే వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి షెకావత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడినవని విమర్శించారు. ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని అన్నారు. ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు 150 మంది జల సమాధి అయ్యారనీ, అయితే అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కనుక నిజాలు దాచే ప్రయత్నం చేశారని అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టులో అయిదవ గేటు తెరుచుకున్నా అందులో నుండి బయటకు వెళ్లగల నీటి సామర్థ్యం 40వేల క్యూసెక్కులు అయితే విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే కాబట్టి ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదని వివరణ ఇచ్చారు.

 

ఎంపిలు సీఎం రమేష్, సుజనా చౌదరిలు టీడీపీ తరపున షెకావత్ కు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడి ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఏమి జరిగింది అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ నుండి గానీ, ప్రాజెక్టు అధికారుల నుండి గానీ కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా నిరాధారాలతో ఇటువంటి ప్రకటన చేయడం ఎంత వరకు సమంజసమని వారు కూడా ఆలోచించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?