Prabhas: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడికి బాగానే ఉంది గానీ, ఇప్పుడు ఇదే మైనస్ అయి సినిమా భారం మొత్తం ప్రభాస్ మీదే పడుతుందని టాక్ మొదలైంది. ఆ టాక్ ప్రకారం చూస్తే సాహో సీన్ ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చిత్రానికి రిపీట్ అవుతుందా..! అంటే ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న మాట ఇదే. ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలతో పెద్ద రిస్కే చేస్తున్నాడని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ లవ్ స్టోరిలో నటించి చాలా ఏళ్లైపోయింది. బాహుబలి – సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం మారిపోయింది. సాహో సౌత్‌లో ఫ్లాపయినా బాలీవుడ్లో మాత్రం గట్టెక్కింది. అయితే ప్రభాస్‌కు ఇప్పుడున్న ఇమేజ్‌కి ‘రాధేశ్యామ్’ లాంటి క్లాస్ లవ్ స్టోరి చూస్తారా అనేది పలువురిలో ఉన్న సందేహాలు. ఇక జిల్ వంటి ఒక మామూలు సినిమాను తీసిన యంగ్ డైరెక్టర్‌కు ‘రాధేశ్యామ్’ లాంటి పీరియాడికల్ సినిమా చేసే అవకాశం ఇవ్వడం. రాధాకృష్ణకు టాలీవుడ్లో అంత గుర్తింపు లేదు. సౌత్‌లో ‘రాధేశ్యామ్’
బిజినెస్ జరగాలంటే ఒక్క ప్రభాస్ పేరు మీదే జరగాలి.
Prabhas: ఇప్పటివరకు గొప్పగా చెప్పుకునే పాట ఒక్కటీ లేదు.
అంతేకాదు బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఉన్నా ఆమె వల్ల సినిమా మార్కెట్ అవుతుందనేది ఓ టాక్ మాత్రమే. ఇక మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాకు ఇప్పటివరకు గొప్పగా చెప్పుకునే పాట ఒక్కటీ లేదు. ఎక్కడ చూసిన ఒక్క ప్రభాస్ వల్లే ఈ సినిమా బిజినెస్ అవ్వాలి తప్ప మరేది కలిసొచ్చే అంశం అయితే కనిపించడం లేదనేది విశ్లేషకుల మాట. అందుకే ఇప్పుడు అన్నీ తానై చూసుకుంటున్నాడట. సాహో రిజల్ట్ తెలిసి కూడా మళ్ళీ యంగ్ డైరెక్టర్ చేతిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టడం అంటే ప్రభాస్ కాన్ఫిడెంట్ ఏంటో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి సంక్రాంతి రేస్‌లో దిగబోతున్న ‘రాధేశ్యామ్’ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.