NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 8 Today Episode: ఈరోజు కార్తీకదీపం సీరియల్ మాములుగా లేదుగా.. సౌందర్య ఎంట్రీ.. రుద్రాణికి షాక్ ఇవ్వనుందా…?

Karthika Deepam Feb 8 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు సాగుతుంది.గత ఎపిసోడ్‌లో కార్తీక్ మోనితకి తెలియకుండా ముఖానికి తుండును కవర్ చేసుకుని అక్కడ ఉన్నవారందరికి కేక్ ఇస్తాడు. ఆ తర్వాత అంజలిని మోనిత కార్తీక్ గురించి అడగడంతో నేటి కథనం మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరగనుందో తెలుసుకుందామా.. ఫంక్షన్ లో భారతి, మోనితను చూసి అనుమానంతో ఏంటి మీ ఇద్దరికీ ఏమైనా సమస్యనా అంటుంది అంజలి. ‘నేను చెబుతాను అంజలిగారు అని కార్తీక్ ఆపరేషన్ చేసిన ఆ అమ్మాయి ఎవరో? తన పేరెంట్స్ ఎవరో వివరాలు చెబుతారా?’ అంటుంది మోనిత. అది విన్న కార్తీక్, దీపఇద్దరూ షాక్ అవుతారు.

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ ఆడియన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్..!!..??

Karthika Deepam Feb 8 Today Episode: మోనితకు కార్తీక్, దీపలు దొరికిపోతారా..?

అంజలి మాత్రం ‘ఎందుకు మోనిత గారు.. మీకు మీ వారికి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అంటుంది అంజలి. అందుకు మోనిత అవును మా వారు అదే కార్తీక్ నా మీద అలిగి నాకు చెప్పకుండా వచ్చేశారు’ అంటూ అబద్దం చెబుతుంది. అక్కడ సీన్ అంతా దీప,కార్తీక్ వింటూనే ఉంటారు. ఇక అంజలి హో అంతేనా అని ఇందాక మీ అందరికీ కేకులు ఇచ్చారు కదా ఆయనే ఆ పాప తండ్రి అని చెప్పడంతో వెంటనే దీప,కార్తీక్ అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు.ఇంతలో మోనిత వాళ్లు వంట చేసే వైపు వెళ్లి అక్కడున్న పనివాళ్లని వాళ్ళ గురించి అడుగుతాడు.‘వాళ్లు ఇప్పుడే వెళ్లిపోయారమ్మా’ అనడంతో అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయ్యానే అని ఫీల్ అవుతుంది మోనిత. అయితే దీప, కార్తీక్ ఆటోలో వెళ్తూ ‘ఈ మోనిత మనల్ని వదిలేలా లేదు’ అనుకుంటూ బాధపడతారు.

Devatha Serial: రాధ ఇంత కఠినంగా మారిపోయిందా..!? అసలు ఏం జరిగిందంటే..!?
హిమను ఎట్టుకెళ్లిన రుద్రాణి మనుషులు :

ఇక అప్పారావు ఇంటి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఎవరు అక్కడ ఉండరు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. దాంతో కంగారుగా దీప, కార్తీక్ తమ వెళ్తారు. అక్కడ అప్పారావు వాళ్ల అమ్మ సౌర్యని ఏడవకు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. దీప రాగానే ‘అమ్మా హిమని ఆ రుద్రాణి వాళ్లు బలవంతంగా ఎత్తుకుని పోయారమ్మ అని చెప్పడంతో దీప, కార్తీక్ షాక్ అయిపోతారు. ఇంతలో రుద్రాణి దగ్గరకు పెద్ద గడ్డం రౌడీ వచ్చి అక్కా పిల్లిగడ్డం వాడు హిమని ఎత్తుకొచ్చాడు కానీ ఇంటికి తీసుకురాకుండా కారులో ఊరంతా తిరుగుతున్నారు ఎందుకక్కా?’ అంటాడు. రేయ్ నా ప్లాన్ నాకు ఉంటుంది అంటుంది. హిమను ఎత్తుకుని వచ్చాము అని తెలిసాక ఇప్పుడు కచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఆ దీప నన్ను కొట్టింది. దాని మొగుడు మిమ్మల్ని కొట్టాడు. అందుకే హిమను ఇంటికి తీసుకుని రాలేదు.ఇక్కడుంటే కొట్టి తీసుకుని వెళ్లరని గ్యారెంటీ ఏంటీ..? అందుకే హిమని ఇక్కడ లేకుండా చేశాను’ అంటుంది రుద్రాణి.

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ ఆడియన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్..!!..??
హిమ కోసం దీప రుద్రాణి కాళ్ళు పట్టుకుంటుందా.?

ఇంతలో నిజంగానే దీప, కార్తీక్ వస్తారు. వాళ్ళను చూసి ‘లక్షల లక్షలు ఆపరేషన్‌కి డబ్బులు వస్తాయి కానీ.. నాకు అప్పు తీర్చడానికి రావా? డబ్బు ఇచ్చి హిమని తీసుకుని వెళ్లండి. అయినా హిమ ఇక్కడ లేదు.కావాలంటే ఇంట్లో వెతుక్కోండి.హిమ ఇంట్లో లేదు.నేను నెల రోజులు టైమ్ ఇస్తున్నాను.ఈ నెల రోజుల్లో డబ్బు సిద్ధం చేసుకోండి.ఈలోపు నేను ఊరు వెళ్ళి వస్తాను అంటూ సామాన్లు పెట్టె చూపిస్తుంది. నేను వెళ్తే రెండు నెలలు దాకా రాను’ అంటుంది.అయితే కార్తీక్, దీపలు ఇళ్లంతా హిమ కోసం వెతుకుతారు కానీ హిమ దొరకదు. కారు దగ్గరకు వెళ్లిన రుద్రాణి ‘దీపా.. నేను వెళ్తున్నాను.అంటే దీప మాత్రం ఏడుస్తూ రుద్రాణి దగ్గరకు పరుగుతీస్తుంది. కారులో వెళ్లిపోకుండా ఆపి దణ్ణం పెట్టి మిమ్మల్ని కొట్టా కదా అని తన కాళ్ల మీద పడి క్షమాపణ కూడా చెబుతుంది.

Bigg Boss 6 Telugu: క్వారన్ టైన్ లోకి ఓటిటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!!
సౌందర్య ఎంట్రీ మాములుగా లేదుగా..?

సరిగ్గా అప్పుడే దీప భుజంపైన చెయ్యి వేస్తుంది సౌందర్య. సౌందర్యని చూసి కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అయిపోతారు.సౌందర్యను చూసి రుద్రాణి హేయ్ నువ్వేంటి ఇక్కడా? నీకు అప్పు కావాలా? లేక నువ్వూ కూడా నన్ను కొట్టినందుకు నాకు ఇలా క్షమాపణ చెప్పడానికి వచ్చావా? అంటుంది. ఇక మన సౌందర్య ఆవేశంతో దీపని పక్కకు లాగి రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తోంది. ‘హేయ్ నన్నే కొడతావా?’ అంటుంది కోపంతో ఉగిపోతుంది రుద్రాణి.దాంతో సౌందర్య కోపంగా ఉష్ మాట్లాడకు అంటూ గొంతు…గొంతు తగ్గించి మాట్లాడు.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ ముందు ఉంది సౌందర్య. కాస్త వాయిస్ తగ్గించి మాట్లాడు.. ఆయుష్ మిగులుతుంది..’ అంటూ వార్నింగ్ ఇస్తుంది.

కార్తీక్, దీపలు ఎవరో తెలిసి షాక్ అయిన రుద్రాణి :

వెంటనే ‘ఏంటి దీపా నువ్వు ఏం చేస్తున్నావే.అంటూ తిడుతుంది.రుద్రాణి షాక్ అయ్యి దీప నీకు తెలుసా అంటుంది రుద్రాణి అనుమానంగా ‘తెలుసా ఏంటి తెలుసా? దీప నా పెద్ద కోడలు అంటుంది.మమ్మీ నువ్వు ఇక్కడా?’ అంటాడు కార్తీక్. రుద్రాణి షాక్ అయిపోతుంది.మమ్మీనా.. ఇతడు నీకు తెలుసా అంటుంది.‘యేయ్ ఇతను ఏంటీ ఇతను కార్తీక్ నా పెద్ద కొడుకు..డాక్టర్ కార్తీక్..’ అంటుంది సౌందర్య.వామ్మో ‘డాక్టరా’ అంటుంది రుద్రాణి షాక్ అయిపోతూ.. ‘హా డాక్టరే.. ఫేమస్ కార్డియాలజిస్ట్. తన అపాయింట్మెంట్ కోసం వేల మంది ఎదురు చూస్తారే..నా కొడుకు వందల మందికి గుండె ఆపరేషన్ చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడతాడు తెలుసా? అయినా నువ్వెంత నీ బతుకెంత?’ అంటూ అరుస్తుంది సౌందర్య.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?