Devatha Serial: సత్య కమలకు శ్రీమంతం చేస్తున్నారని రామ్మూర్తి వారిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. ఎదురుగా మాధవ్ కనిపించగానే సత్య కంగారు పడుతుంది. ఆదిత్య మీదనే నాకు కోపం.. నీమీద నాకు కోపం ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని మాధవ్ చెబుతాడు. నవ్వుకుంటూ సత్య ఇంట్లో కి వెళుతుంది..!!
రామ్మూర్తి వాళ్లు సత్య ఇంట్లో కి వెళ్లడం తోనే రామ లోపలికి అని పిలుస్తారు మా అక్క కమలా శ్రీమంతం చేస్తున్నామని మీరు తప్పకుండా రావాలని వాళ్ళని పిలుస్తుంది. రాధ కూడా ఆ మాటలు వింటుంది. మీ అక్క శ్రీమంతమే అంత ఘనంగా చేస్తుంటే.. ఇక నీ శ్రీమంతం ఇంక ఎలా చేస్తారో అనగానే.. సత్య నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజు మా ఆంటీ ఊరంతా భోజనాలు పెట్టిస్తుంది అని సత్య చెప్పగానే.. రాధ మనసులో నువ్వు ఎప్పటికీ తల్లికి కలేవన్న నిజం నీకు ఎలా చెప్పాలి.. ఆ నిజం తెలిస్తే నువ్వు ఎలా బాధ పడతావు అనుకుంటూ.. రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది..
అంతలో రాధా అక్క ఏది అంటూ తన కోసం ఇంట్లోకి వెళ్తుంది సత్య.. రాధ బాధపడటం చూసిన సత్య కమల అక్కకు శ్రీమంతం అని నువ్వు తప్పకుండా రావాలి అని చెబుతుంది నేనెందుకు వస్తాను నేను ఎక్కడికి రాను అని రాధ చెప్తుంది నువ్వు ఇంటికి రావాలి నాకు తెలిసే.. ఫంక్షన్ హాల్లో శ్రీమంతం చేయడానికి ఏర్పాట్లు చేశాను అక్క.. నువ్వు వచ్చి కమలను దీవించమని చెబుతుంది. సత్య ఎంత చెప్పిన రాధా రావడానికి ఒప్పుకోదు.. కనీసం కమల అక్క ఎలా ఉందో చూడమని ఫోటో చూపిస్తుంది ఎంతసేపటికి ఆ ఫోటో ని చూడడానికి ఇష్టపడదు. ఎందుకు అక్క ఇంత కఠినంగా మారిపోతున్నావు అని ప్రశ్నిస్తుంది.రాధ చేతిలో కమల ఫోటో పెట్టి చూడమని చెబుతుంది. అది చూసిన రాధ లోలోపల బాధపడుతుంది. మరో వైపు కమల శ్రీమంతంకు రామ్మూర్తి వాళ్ళు వెళతారు పిల్లలు రాలేదని ఆదిత్య ప్రశ్నిస్తాడు. ఇక రాధ కమల శ్రీమంతంకు వెళ్తుందా.!? లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..