Mahesh Babu : ఈ మద్య కాలంలో మనం చూసుకుంటే మ్యూజిక్ ఆల్బంలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక వీటికోసం ఉత్తరాదిన భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న సంఘటనలు మనం చూసాం. సౌత్ లో ముఖ్యంగా తెలుగు లో ఒకప్పుడు కేవలం ఫోక్ సాంగ్స్ మాత్రమే మ్యూజిక్ వీడియోలుగా వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మిక్స్డ్ మ్యూజిక్ వీడియో లు ఇపుడు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది సినీ నటీ నటులు కూడా మ్యూజిక్ వీడియో లపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఉత్తరాది మ్యూజిక్ వీడియోలో మెరిసిన సంగతి విదితమే.
Mahesh Babu : తాజాగా మనదగ్గర విడుదలైన ఆల్బం ఇదే
ఇకపోతే, గత కొన్ని రోజులుగా లాలీపాప్ అనే మ్యూజిక్ వీడియో గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు చూసాం కదా. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న అనన్య మరియు శేఖర్ కమ్ములతో డైరెక్ట్ చేయబడ్డ కుర్రాడు సుధాకర్ లు ప్రథాన పాత్రల్లో ఈ లాలీపాప్ అనే మ్యూజిక్ వీడియో రూపొందింది. అయితే ఈ వీడియో ఇపుడు తాజాగా ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
మహేష్ బాబు లాలీపాప్ కహాని:
ఇక ఈ పాటను తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయడం గమనార్హం. దాంతో ఈ పాటకు మరింతగా పాపులారిటీ వచ్చేసింది. మహేష్ చేతుల మీదుగా విడుదల అయిన ఈ మ్యూజిక్ వీడియో ఎటువంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. వినయ్ షన్ముఖ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజిక్ వీడియోను మొదటి పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో గా పేర్కొంటున్నారు. ఎందుకంటే, ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.