Sudha Kongara: పాన్ ఇండియన్ రేంజ్లో భారీ బడ్జెట్స్‌తో కేజీఎఫ్ సిరీస్ నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా మారింది హోంబలే ఫిలింస్. ఇప్పుడు ఈ నిర్మాత విజయ్ కిరంగదూర్ లేడీ స్టార్ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తాజాగా ప్రకటించారు. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సిరీస్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి హాట్ టాపిక్ అయ్యారు విజయ్ కిరంగదూర్. ప్రస్తుతం ఆయన ఇదే సంస్థలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఆయన నిర్మిస్తునారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషలలో ఈ సినిమా ను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్ లుక్స్ అంచనాలను భారీగానే పెంచాయి. అయితే, ఇప్పుడు ఇదే సంస్థ నుంచి మరో భారీ చిత్రం రాబోతోంది. ఈ సారి ఈ సంస్థలో లేడీ డైరెక్టర్ సుధా కొంగర పనిచేయబోతున్నారు. ఆర్ మాధవన్‌తో హిందీలో సాలా ఖడూస్ చిత్రాన్ని తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు.
Sudha Kongara: ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా భారీ స్థాయిలోనే..
ఇదే సినిమాను తమిళంలో , తెలుగులో గురుగా రూపొందించారు. ఆ తర్వాత సూర్యతో ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని తీసి భారీ హిట్ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవ సంఘటనల ఆధారంగా మరో సినిమాను తెరకెక్కించడానికి హోంబలే సంస్థతో కలిసి రంగంలోకి దిగబోతున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరో సహా ఇతర వివరాలను ప్రకటించనున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా భారీ స్థాయిలోనే ఉంటాయి. చూడాలి మరి ఇందులో నటించే హీరో ఎవరో.