NewsOrbit
జాతీయం న్యూస్

Bihar Police: బీహార్ పోలీస్ అధికారి నిర్వాకం!బాధితురాలి చేత పోలీస్ స్టేషన్లోనే మసాజ్ చేయించుకున్న వైనం!చివరకు ఊడిన ఉద్యోగం!

Bihar Police: పోలీసులు ఎక్కడైనా పోలీసులే!వారి రూటే సపరేట్ గా వుంటుంది.ఒంటిపై ఉన్న యూనిఫాం వారికి ఎక్కడలేని అధికారాలను కట్టబెడుతుంది.తాము ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత,తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నంత పోలీస్ పవర్ వారి నరనరాన పొంగుతుంటుంది.అలాగ అధికార దర్పాన్ని తలకెక్కించుకుని ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళ చేత మసాజ్ చేయించుకుని బీహార్లో ఒక పోలీసు అధికారి నాలుగో సింహాన్ని నవ్వుల పాలు చేశాడు.ఆ నిర్వాకం బయటపడటంతో సదరు పోలీసు అధికారి సస్పెండ్ అయ్యాడు.

 Bihar police officer's management! Massage at the police station by the victim!
Bihar police officer’s management! Massage at the police station by the victim!

అసలేం జరిగిందంటే!

బీహార్‌లోని సహర్సా జిల్లా నౌహట్ట పోలీసులు తమ స్టేషన్ పరిధిలో ఒక తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.నిందితులను అరెస్టు చేశారు.ఈ క్రమంలో నిందితుల్లో ఒకరి తల్లి తన బిడ్డను బెయిల్‌ పై విడిపించే మార్గం తెలుసుకోవడం కోసం మరో మహిళ సాయంతో సదరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.పోలీస్ స్టేషన్లో ఆ సమయంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐ శశిభూషన్ సిన్హా ను కలిసింది.తన మొర వినిపించింది.సహాయం చేయమని ప్రార్థించింది.

Bihar Police: అప్పుడా ఎస్ఐ ఏం చేశాడంటే!

దీనికి స్పందించిన ఎస్సై సభ్యసమాజం సిగ్గుపడేలా ఆ బాధితురాలి చేత మసాజ్ చేయించుకున్నాడు.ఒకవైపు మసాజ్ చేయించుకుంటూనే మరోవైపు తనకు తెలిసిన లాయర్ తో ఫోన్లో మాట్లాడాడు.ఆమె కుమారుడికి బెయిల్ ఇప్పించే ఏర్పాట్లు చేయమని,తానే పదివేల రూపాయలు పంపిస్తానని శశిభూషన్ సిన్హా ఆ లాయర్ కు చెప్పాడు.తాను ఇద్దరు మహిళలను ఒక కవరిచ్చి పంపిస్తానని,ఒరు ఆధార్ కార్డులు తెస్తారని,తదుపరి బెయిల్ కు ఏర్పాట్లు చేయమని ఎస్సై ఆ న్యాయవాదికి పురమాయించాడు.

వీడియో ద్వారా వెలుగు చూసిన దారుణం

కాగా ఈ దృశ్యాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసు శాఖలో ప్రకంపనలు రేగాయి.బాధితురాల తో వచ్చిన మరో మహిళే ఈ వీడియో తీసింది అన్న అనుమానాలు లేకపోలేదు.అయితే పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లా ఎస్పీ లిపి సింగ్ వేగంగా స్పందించి ప్రాథమిక విచారణ జరిపించి ఎస్సై శశిభూషణ్ ను సస్పెండ్ చేశారు.ఏదేమైనా పోలీస్ శాఖ పంటల మరో మరక బీహార్ సంఘటన అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు!

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju