Ram Boyapati: ఇండస్ట్రీలో బోయపాటి మంచి జోరు మీద ఉన్నారు. గత ఏడాది బాలయ్యతో చేసిన మూడో సినిమా “అఖండ” బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడంతో.. ప్రస్తుతం రామ్ తో చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో.. రామ్ కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ బోయపాటి సిద్ధం చేయడం జరిగిందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఈ క్రమంలో బురుగుపల్లి శివ రామకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం రామ్ “వారియర్” కి సంబంధించిన షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. జులై 14 వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపిస్తున్నాడు. దీంతో జులై నెల ఆఖరి నుండి బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో రామ్ జాయిన్ కానున్నారని సమాచారం.
ఈ సినిమాలో రామ్ నీ చాలా పవర్ ఫుల్ రోల్ లో బోయపాటి చూపించబోతున్నారు అట. వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ గతంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత “రెడ్” పర్వాలేదనిపించినా ఇప్పుడు రాబోతున్న “వారియర్” పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏమాత్రం హిట్టు పడితే ఇంకా బోయపాటి ప్రాజెక్టు పై మరింత అంచనాలు పెరగనున్నాయి.