NewsOrbit
న్యూస్ సినిమా

జయలలిత, శోభన్‌బాబు లవ్ చేసుకున్నారా.. ఆయన డైరీలో సంచలన నిజాలు..!

సీనియర్ నటుడు శోభన్ బాబు టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తెలుగు చిత్రసీమలో అందగాడిగా, సోగ్గాడిగా పేరు తెచ్చుకొని అమ్మాయిల హృదయాలను దోచేశాడు. ఈ హీరోకి తన శారీరక అందం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా తాను అందంగానే కనిపించాలని ఆయన కోరుకునే వాడు. అందుకే ముసలి వయసు వచ్చాక.. కాస్త అందవిహీనంగా మారాక.. తన ఆహార్యాన్ని చూపించడం ఇష్టం లేక సినిమాల్లో నటించడం మానేశారు. ఈ మాజీ హీరో తెలుగులోనే కాదు తమిళంలో కూడా తన సత్తా చాటాడు. ఆ సమయంలోనే శోభన్ బాబు, జయలలిత ప్రేమలో ఉన్నారని సినీ వర్గాలు కోడై కూశాయి. అయితే ఇందులో నిజముందో లేదో తెలియదు కానీ తాజాగా శోభన్‌బాబు తన డైరీలో జయలలిత గురించి రాసిన కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

జయలలిత తల్లి చనిపోయింది

జయలలిత, శోభన్‌బాబు కాంబినేషన్‌లో “డాక్టర్ బాబు” అనే సినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి, చివరి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్‌కి కొన్ని రోజుల ముందే జయలలిత తల్లి కన్నుమూసారట. తల్లి మరణం తరువాత జయలలిత బాగా మానసికంగా కుంగిపోయారు. ఆ సమయంలో ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చే వారు కరువయ్యారు. అప్పుడే శోభన్ బాబులో ఆమె తన తల్లిని చూసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నాడు. డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. ఆ సమయంలో జయలలిత గురించి ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో పేర్కొన్నాడు.

ఆ డైరీలో ఉన్నది ఏమిటంటే

“బరువైన తన మనసుని నీ జోకులతో తేలిక చేసావు. ప్రపంచం ఇప్పుడు ఎంతో నిర్మలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలి, కలిసి ఉండాలని అనిపిస్తుంది” అని తనతో జయలలిత చెప్పినట్లు డైరీలో శోభన్ బాబు రాసుకొచ్చాడు. “నా అమ్మగారు మరణించాక నా అనుకున్నవాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. బంధువులు డబ్బు కోసమే ఆశ పడ్డారు. ఇవన్నీ చూసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను. ఇలాంటి అత్యంత బాధాకరమైన జీవిత దశనుంచి మీరు వచ్చాకే నాకు విముక్తి దొరికింది” అని జయలలిత తనతో ఎమోషనల్‌గా చెప్పినట్టు శోభన్ బాబు తెలిపాడు. ఈ డైరీ చదువుతుంటే వీరిమధ్య ఒక అన్నా చెల్లె, తండ్రి కూతురు వంటి పవిత్రమైన స్వచ్ఛమైన బంధం ఉందని తెలుస్తుంది తప్ప వారి మధ్య ప్రేమ లేదని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని పలువురు కూడా ఒప్పుకుంటున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N