NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరికి మళ్లీ బారీగా వరద – సముద్రంలో కలుస్తున్న 14లక్షల క్యూసెక్కులపైగా నీరు

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా గోదావరికి వరద మళ్లీ పొటెత్తుతోంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో దవళేశ్వరం ప్రాజక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కోనసీమలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం ఇన్ ఫ్లో 14,73,739 లక్షల క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం నుండి ప్రాజెక్టు కు వెళ్లే దారిలో కడెమ్మ వంతెనపై, పోలీసు చెక్ పోస్టులోకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, టేకులబోరు, శబరికొత్తగుడెం, టేకుబాక, తాళ్లగూడెం గ్రామాల్లో వందల ఇళ్లు జలమయం అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి ఇళ్లు వరద పాలు కావడంతో పూర్తిగా దెబ్బతింటాయనే గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నాారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, అమలాపురంలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఏలూరు జిల్లా కుకునూర్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతోంది. గురువారం ఉదయం 51.30 అడుగులు ఉన్న వరద శుక్రవారం ఉదయానికి 53 అడుగులకు చేరింది. కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల సమీపంలోకి వరద నీరు చేరింది. భద్రాచలం – అశ్వారావుపేట వయా కుక్కునూరు అంతర్జాతీయ రాహదారి గోదావరి వరదలో మునిగిపోవడంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju