అభి హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవ్వాలని బ్లూ కలర్ షర్ట్ తీసి మంచంపై పెడతాడు.. అంకిత కోపంతో తీసి నలిపేస్తుంది.. అయ్యో అంకిత ఐరన్ చేసిన షర్టుని ఎందుకు అలా నలిపేస్తున్నావు.. నేను హాస్పిటల్ కి వెళ్ళాలి అని అభి అంటాడు.. నీ షర్టు నలిపేస్తే నీకు అంత కోపం గా ఉంటే.. ఆంటీని నువ్వు అన్ని మాటలు అన్నావు ఆంటీ ఇంకా ఎంత బాధపడి ఉంటుంది అని అంకిత అంటుంది.. అంకితను ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకోవాలి తనని కూల్ గా డీల్ చేయాలి అని అనుకుంటాడు.. అమ్మ రేపటేషన్ దెబ్బతింటుందని నేను అలా మాట్లాడాను అంతేకానీ తన మీద నాకు ఎలా కోపం లేదు.. నేను నీకోసం ఎక్కడికొచ్చాను అంకితం కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు అభి. ఇక అంకిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
నందు లాస్య ఇద్దరు రెడీ అయి ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. వాళ్ళిద్దరినీ చూసి సామ్రాట్ మీ ఇద్దరిదీ సూపర్ పెయిర్.. చూశావా తులసి గారు నందు ఎప్పుడు తన పక్కనే తన వైఫ్ ఉండాలని అనుకుంటాడు. నిజంగా నన్ను మంచివారు కదా అని తులసితో అంటారు. మంచివాళ్ళు కాదా మనం చెప్పనవసరం లేదు సార్. వాళ్లకు తెలుస్తుంది వారు ఏంటో అని తులసి ఉంటుంది మీరు ఏమంటారు? నందగోపాల్ గారు అని తులసి నందుని చూస్తూ ఉంటుంది. మొహం ఇంత లావుగా పెట్టుకొని గుర్రుగా చూస్తాడు..
తులసి సామ్రాట్ ఫ్లైట్లో పక్కపక్కన కూర్చుంటారు.. లాస్య పక్కన నందు కూర్చుని ఉండడం చూసి అంతలో ఓ స్టార్ కమెడియన్ వచ్చి ఈ ప్లేస్ నాది.. నువ్వు అర్జెంటుగా ఖాళీ చెయ్యి.. ఇది ఎయిర్ బస్సు కాదు అని అంటాడు.. ఇక ఏర్ హోస్టర్స్ వచ్చి చెక్ చేసి మీది వెనకమాల సీడ్స్ అని చెబుతుంది.. సరే ఓకే అని అడ్జస్ట్ అవుతాడు. ఆ తర్వాత ఆ కమెడియన్ తులసి, సామ్రాట్ ను చూస్తూ.. ఆ కమెడియన్ మీరిద్దరూ న్యూ మ్యారీడ్ కపుల్ కదా.. ఎంజాయ్ చేయడానికి వైజాగ్ వెళ్తున్నారు కదూ అని ఆ కమీడియన్ అంటాడు.. ఆ మాటలకు సామ్రాట్ షాక్ అయ్యే అతని వైపు కాదు అని చెప్పే నందు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే నాలుక చీరేస్తా.. నోరు మూసుకొని కూర్చో అని ఆ కమెడియన్ ని చూస్తూ ఉంటాడు ఆ మాటలు విని సామ్రాట్ షాక్ అవుతాడు.. ధైర్యం చేసి నిజంగానే నందు ఆ మాటలు అంటాడా లేదా అంటే లాస్యను కదిలిస్తే అన్నాడా అనేది తరివాయ భాగంలో తెలుసుకుందాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!