NewsOrbit
రాజ‌కీయాలు

‘ఆయనెందుకు నోరుమెదపడు’

విజయవాడ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బందులు పెడతుంటే వైసిపి అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్విన మట్టిని ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందో లేదో తెలుసుకునేందుకు గురువారం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌టిజి) బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది.

పోలవరం కోసం మట్టి తవ్వుతూ ఎక్కడపడితే అక్కడ పోయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని పర్యావరణవేత్త పెంటపాటి పుల్లారావు ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టులోను ఈ వ్యాజ్యం నడుస్తోంది. దీనిపై గతంలోనే ఎన్‌జిటి బృందం నివేదిక తయారు చేసింది. మే 10న విచారణ జరిగే సమయానికి క్షేత్రస్థాయిలో సమగ్ర దర్యాప్తును జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఎన్‌జిటీ ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ బృందం గురువారం పోలవరం ప్రాజెక్టుకు వస్తుండగా మంత్రి దేవినేని ఉమా స్పందించారు.

ప్రాజెక్టును అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీం కోర్టులో, గ్రీన్ ట్రైబ్యునల్‌లోనూ కేసులు వేయిస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఉమా స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తుందన్న భయంతోనే నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్‌లో కేసులు వేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై కెసిఆర్ ప్రభుత్వం దుర్మార్ఘాలు చేస్తుంటే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఉమా ప్రశ్నించారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

Leave a Comment