NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Whey Protein: పాలువిరుగుడు ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు, దీని వలన ఉపయోగం ఏంటి, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

Whey Protein: పాలువిరుగుడు ప్రోటీన్, మజ్జిగ తేట ప్రోటీన్, దీని వలన ఉపయోగం ఏంటి, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

Whey Protein: మీరు వే ప్రోటీన్(Whey Protein) గురించి విని ఉంటారు కానీ అది ఏంటో తెలియక తికమక పడుతున్నారా? ఈ మధ్య కాలం లో ఎక్కడ చూసిన వే ప్రోటీన్ గురించే మాట్లాడుతున్నారు. మీరు జిమ్ కి వెళ్తే అక్కడ, లేదు వ్యాయామం కోసం గ్రౌండ్ కి వెళ్తే అక్కడ కూడా, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ మాట్లాడుతుంది ఈ ప్రోటీన్ గురించే, ఇంతకీ అసలు ఈ ప్రోటీన్ ఏంటో మీకు తెలుసా? అంతె అలచించడానికి ఏమి లేదు, మీకు బాగా తెలిసిన ప్రోటీన్ ఇది, దీనిని తెలుగు లో పాలువిరుగుడు ప్రోటీన్ అంటారు లేదా ఇంకా బాగా అర్ధం అయ్యేట్టు చెప్పాలంటే ఇది మజ్జిగ తేట. మీరు జున్ను లేదా మజ్జిగ చేసుకున్నప్పుడు పైన నీరు లాగా కనబడే తేటనే ఈ ప్రోటీన్. కానీ పాలువిరుగుడు ప్రోటీన్ కొనాలంటే మాత్రం మీ జేబులు కాళీ అవ్వాల్సిందే, ఎందుకంటే పాలువిరుగుడు ప్రోటీన్ ధర చాలా ఎక్కువ. దానికి కారణం, ఒక కిలో  ప్రోటీన్ ను తయారు చెయ్యడానికి సుమారు రెండు వందల లీటర్ల(200L) పాలు కావలి మరి.

Whey Protein: పాలువిరుగుడు ప్రోటీన్, మజ్జిగ తేట ప్రోటీన్, దీని వలన ఉపయోగం ఏంటి, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?
Whey Protein: పాలువిరుగుడు ప్రోటీన్, మజ్జిగ తేట ప్రోటీన్, దీని వలన ఉపయోగం ఏంటి, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

పాలువిరుగుడు ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు:

సాధారణంగా పాలువిరుగుడు ప్రోటీన్ ఒక ఉప ఉత్పత్తి. అంటే ఎవరు ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ కోసం పాలు విరగొట్టరు, చీజ్ అంటే మన భాష లో జున్ను లేదా ఇతర డైరీ కి సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలు వారి ఉత్పత్తులు చేస్తుండగా చివరిగా మిగిలే తేటను పాలువిరుగుడు ప్రోటీన్ తయారీ కంపెనీలకి విక్రయిస్తారు. ఇలా వొచ్చిన ఆ తేటను పాశ్చరైజ్ చేసి  పాలువిరుగుడు ప్రోటీన్ ను తాయారు చేస్తారు. సుమారు రెండు వందల లీటర్ల పాలు విరిగిన తరువాత వొచ్చే తేట తో కేవలం ఒక కిలో ప్రోటీన్ మాత్రమే తాయారు అవుతుంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో చీజ్ బాగా తింటారు అందుకే అక్కడ ఎక్కువగా మజ్జిగ తేట దొరుకుతుంది, ఆలా విరివిగా దొరికే ఆ మజ్జిగ తేటను ప్రోటీన్ పొడిగా మార్చే పారిశ్రామిక సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలు కూడా ఉండటం తో మన దేశం తో పోలిస్తే అక్కడ ఈ ప్రోటీన్ పొడి తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే చాలా మంది విదేశాలలో ఉన్న వారి బంధు మిత్రులతో ఈ ప్రోటీన్ పొడి ని తక్కువ ధరకు తెప్పించుకుంటారు

పారిశ్రామిక ప్రక్రియలో మజ్జిగ తేటను పాశ్చరైజ్ చేసి ఆ తరువాత విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలు ఉండే గొట్టాలు లోకి ఈ  పాశ్చరైజ్ అయిన మజ్జిగ తేటను వదులుతారు. ఇలా శీతల ఉష్ణోగ్రతలకు గురైన మజ్జిగ తేట నుండి కొవ్వులు, లాక్టోస్, పాలువిరుగుడు ప్రోటీన్ విడిపోతాయి. ఇంకేముంది మనకు కావాల్సిన ప్రోటీన్ వొచ్చేసింది, ఈ పాలువిరుగుడు ప్రోటీన్ ను డబ్బాలలో పెట్టి దేశ విదేశాలకు అమ్మేస్తారు.

Whey Protein : పాలువిరుగుడు ప్రోటీన్ వలన ఉపయోగం ఏంటి?

వయసు మీద పడుతున్న కొద్దీ మనిషి కండరము తగ్గిపోతూ ఉంటుంది, ఇందుకు కారణాలు చాలా ఉన్నాయ్, కానీ కారణం ఏదైనా కండరము పునర్నిర్మాణం కోసం  పాలువిరుగుడు ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది.  పాలువిరుగుడు ప్రోటీన్ యొక్క చెప్పుకోదగిన గుణం ఏమిటి అంటే మన శరీరం దానిని సులభంగా గ్రహించడం.

అయితే వ్యాయామం లో శక్తి శిక్షణ లాంటివి చేసేవాళ్ళు దీనిని కొంచెం అధిక మోతాదు లో తీసుకోవొచ్చు. సగటు మనిషికి రోజుకు 40 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అంటే మాంసకృతులు అవసరం పడుతుంది, ఈ ప్రోటీన్స్ ని మన శరీరం రకరకాల అవసరాల కోసం ఉపయోగిస్తుంది. ఇలా రోజూ తాము తినే ఆహర లో సరిపడా మాంసకృతులు దొరకని వారు పాలువిరుగుడు ప్రోటీన్ ని తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకునే వారికి వ్యాయామం తో సంబంధం లేదు, మామూలుగానే  పాలువిరుగుడు ప్రోటీన్ ని పాలలో లేదా నీటిలో కలుపుకొని తీసుకోవొచ్చు.

Health benefits of Whey Protien: పాలువిరుగుడు ప్రోటీన్ వలన ఉపయోగం ఏంటి?
Health benefits of Whey Protien: పాలువిరుగుడు ప్రోటీన్ వలన ఉపయోగం ఏంటి?

పాలువిరుగుడు ప్రోటీన్ తో  రక్తపోటు, టైప్ 2 మధుమేహం(డయాబెటిస్) అదుపు చేసుకోవొచ్చు:

పాలువిరుగుడు ప్రోటీన్ లో ఉండే పెప్టైడ్స్ మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన మందు లాంటిది. ఈ మధ్య కాలం లో ఇలాంటి  పెప్టైడ్స్ ను ఉపయోగించి రసాయనాలు లేని మందులు తాయారు చేయడానికి ఫార్మా కంపెనీలు చాలా పెట్టుబడి పెట్టి పరిశోధనలు చేస్తున్నారు. వే ప్రోటీన్ లో ఉండే పెప్టైడ్స్(లాక్టోకినిన్స్) రక్తపోటు తగ్గిచడానికి తోడ్పడుతుంది. అంతే మన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించే గుణం కూడా పాలువిరుగుడు ప్రోటీన్ కి ఉంది.

పాలువిరుగుడు ప్రోటీన్ తో వెయిట్ లాస్(బరువు తగ్గిచుకోటం)
సాధారణంగా కార్బోహైడ్రేట్లు(పిండిపదార్థములు) తో పోలిస్తే ప్రోటీన్ జీర్ణించుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మిగతా ప్రోటీన్స్ తో పోలిస్తే పాలువిరుగుడు ప్రోటీన్ జీర్ణించుకోవడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇది సరైన సమయం లో తీసుకుంటే ఆకలి తగ్గిపోయి మనం మాములుగా తినే మోతాదు కంటే తక్కువగా తింటాం. ఇలా రోజు చేస్తే మనకు తక్కువ తినటం అలవాటు అయి బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేస్తే పాలువిరుగుడు ప్రోటీన్ తో బరువు తగ్గటం తో పాటు కండరం కోల్పోకుండా ఆరోగ్యకరమైన వెయిట్ లాస్(బరువు తగ్గిచుకోటం) ఉంటుంది.

దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి

ప్రతి నాణేనికి రెండు వైపుల అన్నట్లు, పాలువిరుగుడు ప్రోటీన్ తో జరిగే మంచి తో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి అందరికి వర్తించవు, కొంతమందికి  మాత్రమే ఇలాంటి దుష్ప్రభావాలు ఎదురయ్యా అవకాశం ఉంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము..

అవసరానికి మించి పాలువిరుగుడు ప్రోటీన్ తీసుకుంటే అది జీర్ణించుట కష్టం, దీనివలన అపానవాయువు, అతిసారం, గ్యాస్ ఇలాంటి పొట్టకు సంబంచిని సమస్యలు ఎదుర్కోవాల్సి వొస్తుంది.

లాక్టోస్ అసహనం అంటే మాములుగా పాల పదార్ధాలు పడని వారు పాలువిరుగుడు ప్రోటీన్ ని అసలు తీసుకోకూడదు. తీసుకుంటే పైన చెప్పిన వాటితో పాటు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వొస్తుంది.

మార్కెట్ లో దొరికే పాలువిరుగుడు ప్రోటీన్ పొడిలో వేరే పదార్థాలు కూడా కలిసే అవకాశం ఉంది, మీరు కొనుకున్న ప్రోటీన్ పొడి ప్యాక్ పైన ఉన్న సమాచారాన్ని వివరంగా చదవండి. వారు చెప్పిన సూచనలు తూచా తప్పకుండ పాటించండి.

సారాంశం: ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

సారాంశం: ఫిట్నెస్ కోసం ప్రయతించే యువత అయినా మధ్య వయసు వారైనా దీనిని ఎటువంటి అనుమానము లేకుండ వాడొచ్చు. కేవలం ఫిట్నెస్ కోసమే కాదు మంచి ఆరోగ్యం, వయసు తో వొచ్చే సమస్యలు ఇలాంటి వాటి కోసం కూడా దీనిని వాడొచ్చు. కానీ ఎవరి అవసరానికి తగినట్లు వారు ఈ ప్రోటీన్ పరిమాణం కొలత ప్రకారం తీసుకోవాలి. కొంతమందికి కొన్ని ఆహారాలు పడవు, మీరు పాల పదార్ధాలు పడని వారు అయితే దీనికి దూరంగా ఉండాలి. వయసు మీద పడిన వారు 60 కి చేరువలో ఉన్నవారికి ఇది అవసరం లేదు, తినే ఆహారం సంపూర్ణంగ ఉండి సహజంగ్ పాలు ,పెరుగు,గుడ్లు ఇలా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటే అసలు ఎలాంటి ప్రోటీన్ పొడితో వీరికి అవసరం పడదు.

Fitness & Health Related: Heart rate: పరిగెత్తిన తరువాత మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? ఫిట్నెస్ కోసం పరిగెత్తడం వల్ల మారె గుండెవేగం మీకు మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

 

 

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju