NewsOrbit
హెల్త్

Heart rate: పరిగెత్తిన తరువాత మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? ఫిట్నెస్ కోసం పరిగెత్తడం వల్ల మారె గుండెవేగం మీకు మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

Heart rate: శరీరంలో కొవ్వు కరగాలన్నా, గుండె ఆరోగ్యం మెరుగుపడాలన్నా, ఫిట్నెస్ లెవెల్స్‌ బాగా పెంచుకోవాలన్నా ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఎక్సర్‌సైజ్ రన్నింగ్. అయితే వాకింగ్ చేయడం సింపుల్‌యే కానీ పరిగెత్తడం మాత్రం కాస్త కష్టంతో కూడుకున్న పని. బాగా పొట్ట ఉన్నవారు, ఇంకా ఎక్కువగా ఆయాసం వచ్చేవారు ఈ ఎక్సర్‌సైజ్‌ను ఎక్కువసేపు చేయలేరు. అలాగే ఈ వ్యాయామం చేసేటప్పుడు గుండె వేగం అనేది చాలా అధికమవుతుంది. ఈ ఎక్సర్‌సైజ్ చేసిన వెంటనే చాతీపై చేయి పెట్టుకుంటే గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా హార్ట్ వేగంగా కొట్టుకోవడం మంచిదేనా? అసలు గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది? అనే ప్రశ్నలకు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Heart rate: గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది?

Heart rate

అన్ని శరీర భాగాలు, కణాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. వర్క్ చేసేటప్పుడు, కండరాలు పనిచేసేటప్పుడు వాటన్నిటికీ అవసరమైన ఆక్సిజన్, ఇతర పోషకాలను అత్యధికంగా అందించే బాధ్యతను గుండె తీసుకుంటుంది. ఎంత ఎక్కువగా, ఫాస్ట్‌గా పరిగెత్తితే అంత ఎక్కువ ఆక్సిజన్‌ను మన బాడీ కోరుకుంటుంది. అలాగే మన కండరాలు రక్తం ద్వారా శక్తిని కోరుకుంటాయి. అప్పుడు గుండె అనేది ఆక్సిజన్‌ను శరీర భాగాలు అందించడానికి ఊపిరితిత్తుల ద్వారా చాలా వేగంగా ఆక్సిజన్ తీసుకుంటుంది. అలానే కాలేయం ద్వారా అదనపు రక్తం పంపించడానికి ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. తత్ఫలితంగా హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

హార్ట్ బీట్/రేట్ పెరగడం మంచిదేనా

Heart rate

ఖాళీగా కూర్చున్నప్పుడు నిమిషానికి 60 నుంచి 100 సార్లు గుండె కొట్టుకుంటే అది నార్మల్ అని చెప్పవచ్చు. దీనిని రెస్టింగ్ హాట్‌ రేట్ అంటారు. ఈ రెస్టింగ్ హాట్‌ రేట్ అనేది ఒకరి ఫిట్నెస్ లెవెల్స్‌కి ఇండికేటర్‌గా నిలుస్తుంది. సైక్లింగ్, రన్నింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు రొటీన్‌గా చేసినప్పుడు గుండె అనేది బాగా వర్క్ చేస్తుంది. క్రమక్రమంగా ఆ గుండె బలపడుతుంది. అప్పుడు రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతుంది. బాగా ట్రైనింగ్ తీసుకున్న ఒక అథ్లెట్‌ రెస్టింగ్ హాట్‌ రేట్ నిమిషానికి 40 అలా ఉంటుంది. సో, ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు హార్ట్ రేట్ పెరగడం గురించి ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే ఆ హార్ట్ రేట్ అనేది ఆరు నుంచి ఏడు నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది. అలాగని హార్ట్ రేట్ మరీ ఎక్కువ పెరిగేంతలా బాడీని కష్టపెట్టకూడదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గరిష్ఠ హృదయ స్పందన రేటులో 50 నుంచి 75 శాతం రీచ్ అవుతే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా గుండె వేగాన్ని పెంచితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

Heart rate

ఫిట్నెస్ కోసం చేసే ఎక్సర్‌సైజుల వల్ల రెస్టింగ్ హాట్‌ రేట్ తగ్గితే.. ఫిట్నెస్ పెరిగిందని అర్థం. ఫిట్నెస్ పెరగడం వల్లే హార్ట్ అనేది బాడీకి పోషకాలు అందించడానికి స్పీడ్‌గా పనిచేయాల్సిన అవసరం తప్పుతుంది. అదే పెరిగితే మీ గుండె అసాధారణంగా కొట్టుకుంటుందని అర్థం చేసుకొని డాక్టర్‌ని కలవాలి. గుండె 40-60 సార్లు నిమిషానికి కొట్టుకుంటున్నప్పుడు మీకు కళ్ళు తిరిగినట్లు లేదా బాగా నీరసంగా అనిపిస్తే కూడా డేంజరేనని అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ని కలవాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri