అన్న శింబు కంటే తమ్ముడు కురళరసన్ ముందున్నాడు. అది ఏ విషయంలో అంటే… పెళ్ళి విషయంలో. హీరోగా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న శింబు ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదు. కానీ, అతని తమ్ముడు మాత్రం ఈ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరు సీనియర్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ కుమారులన్న విషయం తెలిసిందే. కురళరసన్ బాలనటుడుగా పలు సినిమాల్లో కనిపించాడు. ఆ తర్వాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆళు’ చిత్రం ద్వారా అతను సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో అతను ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. స్థానిక అన్నాశాలైలోని మసీదులో జరిగిన ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. తమ్ముడు పెళ్లి కోసం లండన్‌లో ఉన్న శింబు చెన్నైకి వచ్చాడు. ఈ నవ వధూవరుల వివాహ రిసెప్షన్‌ను టీ.రాజేందర్ ఈ నెల 29న చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!