NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ నోట ‘రజనీ’ పంచ్ డైలాగ్ .. తోడేళ్లన్నీ ఏకమైనా సింహం సింగిల్ గానే అంటూ..

శివాజీ సినిమాలో ప్రముఖ హీరో రజనీ కాంత్ కుక్కలే గుంపులుగా వస్తాయ్ .. సింహం సింగిల్ గానే వస్తుందంటూ అన్న డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర పక్షాలు అన్నీ కలుస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నోటి వెంట రజనీ డైలాగ్ వచ్చింది.  తోడేళ్లన్నీ ఒక్కటై వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి డైలాగ్ పేల్చారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షాలు, ఆ పార్టీకి అనుకూల మీడియాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

AP CM YS Jagan Speech Vinukonda

 

రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ దుష్ప్రచారం చేశారనీ, కానీ ఇప్పుడు ఏపి దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. దేశంలోనే జీడీపీ డీఎస్ డీపీ (గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. ఏపి గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే ఇలాంటి ఫలితం సాధ్యమవుతుందని అన్నారు. గతంలో గజ దొంగల ముఠా ఏపీని దోచేశారని విమర్శించారు. గతంలో సీఎంగా ఓ ముసలాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవారు, ఆయనతో పాటు ఓ గజ దొంగల ముఠా ఉండేది. వాళ్లు దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఇవ్వలేదన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్) ఏం చేశాడో చూశారు కదా, తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయ.. మీ బిడ్డకు ఎలాంటి పొత్తు లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే .. సింహంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డకు ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు అని అన్నారు జగన్.

Vinukonda Jagan Meeting

 

ఇది పేద వాడికి, పెత్తందారుడికి మధ్య నడుస్తున్న యుద్దంగా పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే.. వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నాయని అన్నారు. గజ దొంగల పాలన కావాలా, లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  మీ దీవెనలు బిడ్డపై ఉండాలని కోరుకుంటున్నానని జగన్ చెప్పారు. ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వివరించారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం 3,30,145 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. జగనన్న చేదోడు పథకం కింద ప్రతి ఏటా దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు పది వేల చొప్పున ప్రభుత్వం ఆర్దిక సహాయం అందిస్తొంది.

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీ సర్కార్ కీలక నిర్ణయం

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju