NewsOrbit
జాతీయం న్యూస్

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ..కుమార స్వామి సీఎంగా హ్యాట్రిక్ కొడతారా..?

Karnataka assembly election 2023 exit polls

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇటు పోలింగ్ పూర్తి కాగానే మెజార్టీ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ నిలుస్తాయని పేర్కొన్నాయి. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మళ్లీ కుమార స్వామి కింగ్ మేకర్ అవుతారనీ, తద్వారా ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

Karnataka assembly election 2023 exit polls
Karnataka assembly election 2023 exit polls

 

కాంగ్రెస్ కు 94 నుండి 108 మధ్య సీట్లు వస్తాయని రిపబ్లిక్ పీ – మార్క్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 85 నుండి 100 వస్తాయని పేర్కొంది. జేడీఎస్ కు గరిష్టంగా 32 స్థానాలు రావచ్చని లెక్కగట్టింది. న్యూస్ నేషన్ సీజీఎస్ ఎగ్జిట్ పోల్ మాత్రం 114 స్థానాలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ కు 86 స్థానాల్లో, జేడీఎస్ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. సువర్ణ న్యూస్ – జన్ కీ బాద్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 94 నుండి 117 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 91 నుండి 106 స్థానాలు, జేడీఎస్ కు 14 నుండి 24 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే 113 స్థానాలు అవసరం అవుతాయి. 2018 ఎన్నికల్లోనూ రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. బీజేపీకి 104 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ 80 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచింది. ఏ పార్టీకి మెజార్టీ రానందున చివరకు కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ప్రభుత్వం ఎంతో కాలం నిలవలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు కుమార స్వామి సీఎంగా వ్యవహరించారు. తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది.

అంతకు ముందు బీజేపీ వాళ్లు ఆయనకు ఒక సారి రెండున్నరేళ్ల పాటు సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ప్రస్తుతం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే కుమారస్వామి మరో సారి నక్కతోక తొక్కినట్లేనా అన్న మాట వినబడుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే కుమారస్వామి హవా మరి కొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు.

Pawan Kalyan: దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju