NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Varahi Yatra: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు … జనసేనకు అధికారం ఇవ్వాలంటూ..

Janasena Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేనకు అధికారం ఇవ్వాలన్నారు. జనసేనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే జనసేన పార్టీ 88 అసెంబ్లీ స్థానాలు జనసేన గెలవాలి. రాష్ట్రంలో 175 స్థానాలు పోటీ చేసే విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్దంగా ఉన్నాననీ, ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు.

Pawan Kalyan Speech in Pithapuram kakinada dist

కొద్ది రోజుల క్రితం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని, గౌరవ ప్రదంగా సీట్ల షేరింగ్ జరిగితే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తామనీ, బీజేపీని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు పొత్తులపై ప్రస్తావన లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లననీ, మీరు నాకు సంపూర్ణ అధికారం ఇస్తే సీఎం పదవి చేపడతానని పేర్కొన్నారు. వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని మరో సారి అధికారంలోకి రానివ్వకూడదని అన్నారు. తనకు ఒక్క సారి అధికారం ఇవ్వాలని అభ్యర్ధించారు పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి వస్తే ముందుగా ముందుగా శాంతి భద్రతలపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 25వేల ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జనసేన షణ్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.

పిఠాపురాన్ని అథ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో హిందూ దేవాలాయల ధ్వంసం దారుణమని తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆలయాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తూ .. రాష్ట్రంలో 219 హిందూ ఆలయాల్లోనూ పిచ్చివాళ్లే ధ్వంసం చేశారా అని ప్రశ్నించారు.  ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఒక్కరినీ పట్టుకోలేదని మండిపడ్డారు. ఆంధ్ర బాగుపడాలంటే మన కులపోడా, కాదా అన్నది చూడవద్దు.. మనకు సరైనోడా కాదా అన్నది చూడండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా పన్నుతానని అన్నారు. ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఈ కిడ్నాప్ అంశంలో డీజీపీ మాటలు బాధకలిగిస్తున్నాయని పవన్ అన్నారు.

YS Jagan: చంద్రబాబు గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు – జగన్ ధ్వజం

Related posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju