NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మరో సారి ఘాటుగా విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో సారి సీఎం వైఎస్ జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. నాల్గవ విడత జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురపాంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అబద్దాలు, మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదన్నారు.

CM YS Jagan Slams chandra Babu and pawan kalyan

 

టీడీపీ అంటే తినుకో..దండుకో..పంచుకో గా మార్చేశారని విమర్శించారు జగన్. మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు ఏ ప్రాంతానీ, ఏ సామాజిక వర్గానికి మంచి చేయలేదనీ, ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారనీ, అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడని అన్నారు. మన రాష్ట్రంలో మంచి చేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయన్నారు. మంచి అనొద్దు.. మంచి వినొద్దు.. మంచి చేయొద్దు అన్నదే వారి విధానమని అన్నారు. నమ్మించి ప్రజలను నట్టేట ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి అని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారన్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో కళ్లు మూసుకుపోయాయన్నారు.

ఆ దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడనీ, ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చని వారని..చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడనీ, ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదని అన్నారు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేమనీ, దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, పూనకం వచ్చినట్లు ఊగిపోతీ బూతులు తిట్టలేమ్, అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని ఘాటుగా కామెంట్స్ చేశారు సీఎం జగన్.

దుష్ట చతుష్టయం సమాజాన్ని చీల్చుతోందని కానీ మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయన్నారు. అందుకే పనికి మాలిన పంచ్ డైలాగులు ఉండవ్ . బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డామన్నారు. మీ బిడ్డ పొత్తుల కోసం ఏ రోజూ పాకులాడలేదన్నారు. తోడేళ్లను నమ్ముకోలేదు. దత్తపుత్రుడుని నమ్ముకోలేదన్నారు. జరగబోయే కురక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ అని అన్నారు. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు. ప్రజలు మాత్రమేనన్నారు. మకు మంచి చేశాను అనిపిస్తే ఈ యుద్దంలో మీరే నాకు అండగా నిలవాలని జగన్ కోరారు.

అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్ .. పది రోజుల పాటు పండుగలా..

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?