టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో సారి సీఎం వైఎస్ జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. నాల్గవ విడత జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురపాంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అబద్దాలు, మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదన్నారు.

టీడీపీ అంటే తినుకో..దండుకో..పంచుకో గా మార్చేశారని విమర్శించారు జగన్. మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు ఏ ప్రాంతానీ, ఏ సామాజిక వర్గానికి మంచి చేయలేదనీ, ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారనీ, అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడని అన్నారు. మన రాష్ట్రంలో మంచి చేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయన్నారు. మంచి అనొద్దు.. మంచి వినొద్దు.. మంచి చేయొద్దు అన్నదే వారి విధానమని అన్నారు. నమ్మించి ప్రజలను నట్టేట ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి అని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారన్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో కళ్లు మూసుకుపోయాయన్నారు.
ఆ దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడనీ, ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చని వారని..చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడనీ, ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదని అన్నారు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేమనీ, దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, పూనకం వచ్చినట్లు ఊగిపోతీ బూతులు తిట్టలేమ్, అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని ఘాటుగా కామెంట్స్ చేశారు సీఎం జగన్.
దుష్ట చతుష్టయం సమాజాన్ని చీల్చుతోందని కానీ మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయన్నారు. అందుకే పనికి మాలిన పంచ్ డైలాగులు ఉండవ్ . బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డామన్నారు. మీ బిడ్డ పొత్తుల కోసం ఏ రోజూ పాకులాడలేదన్నారు. తోడేళ్లను నమ్ముకోలేదు. దత్తపుత్రుడుని నమ్ముకోలేదన్నారు. జరగబోయే కురక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ అని అన్నారు. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు. ప్రజలు మాత్రమేనన్నారు. మకు మంచి చేశాను అనిపిస్తే ఈ యుద్దంలో మీరే నాకు అండగా నిలవాలని జగన్ కోరారు.
అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్ .. పది రోజుల పాటు పండుగలా..