NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CI Swarnalatha: ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతకు బిగ్ షాక్

CI Swarnalatha: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయిన హోంగార్డ్స్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత పై ఆ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద అమెతో పాటు కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డు వి శ్రీను, మధ్యవర్తి సూరిబాబులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చనగా మెజిస్ట్రేట్ వారికి 21వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. దీంతో వీరిని విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. స్వర్ణలత బెయిల్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. గతంలో కూడా స్వర్ణలతపై చాలా ఆరోపణలు వచ్చాయని అంటున్నారు.

swarnalatha

 

ఏఆర్ హోంగార్డు ఎస్ఐగా పని చేస్తున్న సమయంలోనే హోంగార్డు నియామకాల విషయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత విజయవాడ బదిలీపై వెళ్లగా, కొంత కాలం పని చేసి శ్రీకాకుళం ఏఆర్ కు బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తుండగా, జిల్లాల విభజన జరగడంతో బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. ఆ తర్వాత విశాఖలో ఖాళీ ఉండటంతో అక్కడికి వచ్చారు. కొంత కాలం పాటు సిటీ ట్రైనింగ్ సెంటర్ లో పని చేసిన తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ) గా బాధ్యతలు చేపట్టారు. నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయిన నేపథ్యంలో ఇన్స్ పెక్టర్ స్వర్ణలత, కానిస్టేబుల్ హేమసుందర్ లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఇన్స్ పెక్టర్ స్వర్ణలత సినిమాలపై మోజుతో హీరోయిన్ గా ఏపీ 31 నంబర్ మిస్సింగ్ అనే టైటిల్ తో ఓ మూవీ నిర్మించాలని అనుకుంటున్నారు. ఇందులో ఆమెది పోలీస్ ఆఫీసర్ పాత్ర. సినిమాకు సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సినిమాల మీద మోజుతో ఆమె ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్ ను ఏర్పాటు చేసుకుని డ్యాన్స్ లో తర్ఫీదు పొందుతున్నారు. పలు టాలీవుడ్ పాటలకు ఆమె చేసిన డ్యాన్స్ కు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాష్ట్ర పోలీసు అధికారుల అసోసియేషన్ ఉపాధ్యక్షురాలుగా ఉన్న స్వర్ణలత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పోలీస్ వర్గాలను కించపరుస్తూ మాట్లాడిన నేతలపై పంచ్ డైలాగ్ లు పేలుస్తుంటారనే పేరు ఉంది. మరో విశేషం ఏమిటంటే ఆమె సొంత జిల్లా విజయనగరంలో స్వర్ణ ఫౌండేషన్ పేరుతో స్వచ్చంద సంస్థ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసు కారణంగా ఆమె స్వచ్చంద సంస్థ ద్వారా చేసిన మంచి పనులు కూడా మంట గలిసే పరిస్థితి ఏర్పడింది.

CI Swarna Latha: ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతలో మరో కోణం సూపరో సుపర్.. ఊహకందని బిగ్ ట్విస్ట్

Related posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?