NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు బిగ్ షాక్

Telangana High Court Key Verdict on Kothagudem mla disqualification case

Breaking: తెలంగాణ హైకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్మే వనమా వెంకటేశ్వరరావు కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు..కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న అభ్యర్ధి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదని ఆరోపిస్తూ జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.

Telangana High Court Key Verdict on Kothagudem mla disqualification case
Telangana High Court Key Verdict on Kothagudem mla disqualification case

 

జలగం వెంకట్రావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపితం కావడంతో హైకోర్టు వనమాపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గానూ రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్ 12 నుండే జలగం వెంకట్రావు ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుండి తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకట్రావుపై 4,120 ఓట్లు మెజార్టీతో గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ లో చేరారు వనమా.

ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వనమాపై జలగం వెంకట్రావు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. వనమా ఎన్నిక చెల్లదంటూ తగిన అధారాలు చూపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో తీవ్ర జాప్యం జరగడంతో 2021లో జలగం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో త్వరగా కేసు విచారణ జరిపి తీర్పు వెల్లడించాలంటూ తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వాదనలకు హైకోర్టు ఏకీభవిసస్తూ వనమాపై అనర్హత వేటు వేసింది.

ఈ కేసులో విజయం సాధించిన జలగం వెంకట్రావు దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు. జలగం వెంకట్రావు 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి తొలి సారిగా సత్తుపల్లి నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా కొత్తగూడెం నుండి పోటీ చేసి గెలిచారు.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ .. నేటి నుండి మూడు రోజుల పాటు వర్షాలు

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju