NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: అప్పటివరకూ పోలీస్ మీద అరిచిన చంద్రబాబు – CID ఆ మాట చెప్పగానే వెంటనే ఒప్పుకుని విజయవాడ బయలుదేరాడు !

chandrababu reaction about CID comments

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఈ ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టునకు ముందు నంద్యాలలో పెద్ద హైడ్రామా నడిచింది. అరెస్టు సమయంలో చంద్రబాబు తో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన సీఐడీ అధికారులపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడగా రిమాండ్ రిపోర్టు ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో చంద్రబాబు చప్పుడు చేయకుండా అరెస్టు కావడానికి అంగీకరించారు.

chandrababu reaction about CID comments
chandrababu reaction about CID comments

తొలుత నాపై ఎఫ్ఐఆర్ లేదు. ఏదో జరిగిందని కేసు పెట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు. స్కీల్ డవలప్ మెంట్ స్కామ్ లో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి. ఆధారాలు ఉంటే ఉరి తీయండి, దర్యాప్తు అధికారి రాకుండా సూపర్ వైజర్ అధికారి రావడం ఏమిటి. మీరు చుట్టుముట్టి నన్ను బెదిరిస్తారా అంటూ సీఐడీ అధికారులతో వాదనకు దిగారు చంద్రబాబు. దీంతో విజయవాడ వెళ్లే సమయానికి రిమాండ్ రిపోర్టు అందిస్తామనీ, ముందే ఇవ్వడం కుదరనీ, రిమాండ్ రిపోర్టులోనే అన్ని విషయాలు ఉంటాయని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. మరో పక్క నాన్ బెయిలబుల్ సెక్షన్ లతో కేసు పెట్టారు, సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు. అరెస్టునకు ముందే కు వివరుల చెప్పాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సీఐడీ అధికారుల వద్ద పట్టుబట్టడంతో చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామని సమాధానం ఇచ్చారు సీఐడీ అధికారులు.

chandrababu reaction about CID comments
chandrababu reaction about CID comments

అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమిటి, నేను ఏమైనా టెర్రరిస్టునా, ప్రాధమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారా అంటూ మరో సారి చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు. దీంతో తమకు అరెస్టు చేసిన తర్వాత 24 గంటల వరకూ సమయం ఉంటుందనీ, గడువులోగా కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని చంద్రబాబు న్యాయవాదులకు తెలియజేశారు. అరెస్టునకు ముందు ప్రాధమిక సాక్ష్యాలు చూపించాలని చట్టంలో లేదని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. దాదాపు గంటకుపైగా వాదనలకు దిగిన చంద్రబాబు సీఐడీ అధికారుల వివరణతో అరెస్టునకు సంబంధించి పేపర్లపై సంతకం చేసి వారికి సెరండర్ అయ్యారు చంద్రబాబు.

chandrababu reaction about CID comments
chandrababu reaction about CID comments

తొలుత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు అరెస్టు చేయడానికి ఆర్కే ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లిన సీఐడీ అధికారులను చంద్రబాబు భద్రతా సిబ్బంది అడ్డుకుంది. ఈ సమయంలో డిస్ట్రబ్ చేయమని, తెల్లవారిన తర్వాత మాట్లాడటానికి అనుమతిస్తామని ఎన్ఎస్జీ కమాండోలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబుతో సీఐడీ అధికారులను మాట్లాడటానికి అనుమతించారు.

chandrababu reaction about CID comments
chandrababu reaction about CID comments

స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసును ఏపీ సీఐడీ 2021 డిసెంబర్ 9న నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ను 37 వ నిందితుడుగా పేర్కొన్నారు. ఆయనపై 166, 167, 418, 420, 465, 468, 471,409, 201, 109 రెడ్ విత్ 120 బీ ఐపీసీ, 13(2), రెడ్ విత్ 13(1)సీ, రెడ్ విత్ 13(1)(డీ) పీసీఏ సెక్షన్ ల కింద కేసు నమోదు అయి ఉంది.

Related posts

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N