NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారుల బృందం

ntr reaction on chandrababu arrest

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారణ జరిపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవేళ సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైల్ కు చేరుకుని ఇంటరాగేషన్ చేస్తొంది. చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు సమక్షంలో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం ఇంటరాగేషన్ జరుపుతోంది. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయగా, విచారణ పూర్తి అయిన తర్వాత కూడా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ రోజు, రేపు 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ చంద్రబాబును సీఐడీ విచారణ చేస్తుంది.

ntr reaction on chandrababu arrest
ntr reaction on chandrababu arrest

అయితే ఆయన ఆరోగ్య రీత్యా గంటకు అయిదు నిమిషాలు విచారణ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2 గంటల వరకూ లంచ్ బ్రేక్ ఉండనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి జీజీహెచ్ కు చెందిన వైద్య అధికారుల బృందాన్ని జైల్ వద్ద అంబులెన్స్ లతో ఏర్పాటు చేశారు. జైల్ లోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ వీడియో గ్రఫీ తీస్తున్నది. చంద్రబాబు విచారణ నేపథ్యంలో జైల్ పరిసరాల్లో రెండంచెల భారీ బందోబస్తు ను అధికారులు ఏర్పాటు చేశారు.

chandrababu reaction about CID comments
chandrababu

సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారులు వి విజయభాస్కర్, ఎ లక్ష్మీనారాయణ, ఎం సత్యనారాయణ, మోహన్, రవికుమార్, శ్రీనివాస్, రంగనాయకులు మరో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో విచారణ కొనసాగిస్తున్నారు. తొలుత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ జరిపిన సందర్భంలో వారు అడిగిన ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదు అన్నట్లుగా సమాధానాలు చెప్పారుట. అయితే ఇప్పుడు విచారణ సమయంలో చంద్రబాబు నుండి ఏ విధంగా సమాధానాలు రాబడతారు అనేది ఆసక్తికరంగా మారింది. విచారణ అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని ఏసీబీ కోర్టు ఆదేశిస్తూ, విచారణ నివేదకను సీల్డ్ కవర్ లో కోర్టు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?