NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఆ అధికారులను బదిలీ చేయాల్సి చేయాల్సిందే .. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Revanth Reddy: బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బృందం ఈసీని కలిసి కేసిఆర్ పై ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ వంటి అధికారులు ఎన్నికలలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని అన్నారు. స్టీఫెన్ రవీంద్ర ను కూడా బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు.

రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుండి తొలగించాలని కూడా కోరినట్లు రేవంత్ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులను ఎన్నికల విధుల నుండి తొలగించాలని కోరామని చెప్పారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూసేవా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సీఎం అధికారిక నివాసంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు బీ ఫారంలు అందజేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధులను నోటిఫికేష్ (నవంబర్ 2వ తేదీ) జారీ లోపు విడుదల చేయాలని తాము కోరామనీ, అంతే కానీ సంక్షేమ పథకాలను అపమని తాము కోరలేదని తెలిపారు.

కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వవద్దంటూ పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఆర్ధిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కొందరు కీలక రంగాల్లో ఉన్న అధికారులు కోరుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం .. చడ్డీ గ్యాంగ్ లు అని అన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రం పని చేస్తుందని ధ్వజమెత్తారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని అన్నారు. తొమ్మిదేళ్లుగా కొంత మంది అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని అన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తొందని అన్నారు. ప్రజలు మళ్లీ కేసిఆర్ మాయలోపడేందుకు సిద్దంగా లేరని అన్నారు. నాణ్యతాలోపం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిందన్నారు. కుట్ర కోణం అంటూ తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తొందని విమర్శించారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదని అన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను బయటపెట్టడం లేదని అన్నారు. కేంద్రానికి, బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

YSRCP: సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించి పేదవాడి విజయానికి బాటలు వేయాలి – సీఎం జగన్

Related posts

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?