NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. నియోజకవర్గాల్లో చిచ్చు రేపిన కొత్త ఇన్ చార్జ్ ల నియాకమం

YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార వైపీసీ ప్రణాళికలు రచిస్తొంది. ఈ క్రమంలో సర్వేల ఆధారంగా పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారి అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు, వైసీపీ ఇన్ చార్జి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేశారు.

మంగళగిరిలో ఆళ్ల అనుచరులు పలువురు పార్టీ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ కీలక నిర్ణయంలో భాగంగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించింది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులకు స్థాన చలనం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జి గా మంత్రి విడతల రజిని, మంగళగిరికి గంజి చిరంజీవి, పత్తిపాడుకి బాలసాని కిషోర్ కుమార్, వేమూరుకు అశోక్ బాబు, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, తాడికొండ కు మేకతోటి సుచరిత, కొండపికి మంత్రి ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి, రేపల్లెకు ఈవూరు గణేష్, గాజువాకకు వరికూటి రామచంద్రరావు లను పార్టీ నియమించింది.ysrcp political issuesin 6 constituencys

ఈ విషయాన్ని సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసినట్లుగా తెలిపారు. పార్టీ ఎవరినీ వదులుకోదనీ, అందరి సేవలనూ వినియోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నేతల గెలుపు అవకాశాన్ని బట్టి ఇన్ చార్జిలను మార్చామని ఆయన స్పష్టత ఇచ్చారు. అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ సర్కార్ అచచూతి అడుగులు వేస్తొందని చెప్పారు. గుంటూరు పశ్చిమకు మంత్రి విడతల రజినిని ఇన్ చార్జిగా నియమించడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నుండి గెలిచి వైసీపీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.

రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎక్కువగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి లేదా తమ్ముడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అత్యంత సన్నిహితుడైనప్పటికీ డాక్టర్ ఈవురు గణేష్ ను సమన్వయకర్తగా ప్రకటించారు. దీంతో మోపిదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ మోపిదేవి అనుచరులు అర్ధరాత్రి రేపల్లెలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. మోపిదేవికి మద్దతుగా పలువురు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామాకు సిద్దమవుతున్నారు. రేపల్లె కొత్త ఇన్ చార్జి నియామకం పై అధిష్టానం పునరాలోచించలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరిలో ఆళ్ల అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేసిన రెండు మూడు నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు, వారి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

YSRCP: అధికార వైసీపీలో కలకలం రేపుతున్న రాజీనామాల పర్వం .. ఆర్కే రాజీనామాతో గంజి చిరంజీవికి సీఎంఓ నుండి పిలుపు

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N