NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: అధికార వైసీపీలో కలకలం రేపుతున్న రాజీనామాల పర్వం .. ఆర్కే రాజీనామాతో గంజి చిరంజీవికి సీఎంఓ నుండి పిలుపు

YSRCP: అధికార వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కలకలం రేపుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే నియోజకవర్గంలోని పలువురు నాయకులు రాజీనామా బాటపట్టారు. వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి రాజీనామా చేశారు. అలానే తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు, జేసిఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ జేసిఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా  సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లవరపు సుధారాణి లు రాజీనామా చేశారు.

అలానే మంగళగిరి మాజీ కౌన్సిలర్ కలకోటి స్వరూప రాణి, నియోజకవర్గ  నాయకులు కలకోటి బోయోజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్కే రాజీనామా నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ నేత గంజి చిరంజీవికి సీఎంఓ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆర్కేను పక్కన పెట్టాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు గా వార్తలు రావడం, ఆ వెంటనే గంజి చిరంజీవికి పార్టీ అధినేత, సీఎం జగన్ నుండి పిలుపు రావడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mangalagiri: Lokesh Political Strategy Mangalagiri Ground Report
Alla Ramakrishna Reddy

ఇదిలా ఉంటే మరో పక్క గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఇన్ చార్జి పదవికి ఇవేళే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడే దేవన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తిప్పల నాగిరెడ్డి. అనంతరం ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పార్టీ నియమించింది.

రాబోయే ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ సీటును బీసీ (యాదవ) సామాజికవర్గంకు కేటాయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం వల్లనే దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ మంగళగిరిలో, అటు గాజువాకలో బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురవుతూ రాజీనామా బాటపడుతున్నారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Alla Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాపై స్పీకర్ తమ్మినేని స్పందన ఇది .. రాజీనామా ఆమోదిస్తారా..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju