NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ లోకి షర్మిల .. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, వైవీ కీలక వ్యాఖ్యలు

YS Sharmila: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇవేళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రారంభించిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడుస్తారని, దీని వల్ల వైసీపీ కి నష్టం అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అధికార వైసీపీకే లాభమని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ కీలక  వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు (వైసీపీ)కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వైవీ అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరు కలిసినా, కుటములుగా వచ్చిన తమకు భయం లేదని స్పష్టం చేశారు. తమకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, మళ్లీ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనని అన్నారు. వైసీపీలో ఇన్ చార్జిల మార్పు అంశంపై మాట్లాడుతూ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్ర్పారు. మార్పులు, చేర్పులు కొంత మందికి నచ్చకపోవచ్చని అన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ .. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, చీల్చడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నైజమని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా ప్రత్యర్ధిగానే చూస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రజలు జగన్ ను మరో సారి సీఎం చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ వెంటే నడుస్తామని అన్నారు.

MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?