NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: గంగాధర్ కి థాంక్స్ చెప్పిన గంగ, శ్రీలక్ష్మి చేతుల్లో చీపిరి దెబ్బలు తిన్న పాండురంగ..

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

Mamagaru: వాళ్ల మనసులో కోపాలు ఉంటే ఎలా అత్తయ్య వాళ్ళని ఒకటి చేసేది అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ పెద్దవాళ్ళం కదా మనం ఏదో ఒకటి చేయాలి అని దేవమ్మ అంటుంది. అవును శ్రీలక్ష్మి పెళ్లి అయినాక నుంచి గంగకు నల్లపూసల తాళి పండుగ చేయలేదు కదా అది ఇప్పుడు చేస్తే వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని దేవమ్మ అంటుంది. ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది అత్తయ్య అని శ్రీలక్ష్మి అంటుంది. అంతలో గంగ వచ్చి అత్తయ్య నేను బయటికి వెళ్లాలనుకుంటున్నాను అని అంటుంది. నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని దేవమ్మ అంటుంది. నా గురించి మాట్లాడుకోవడానికి ఇంకా ఏముంది అత్తయ్య ఏ అబద్ధం చెప్పాలనుకుంటున్నారా అని గంగా అంటుంది. అమ్మ గంగా జీవితం నీటి మీద పడవ లాగా నడవాలి కానీ నీటిలో మునిగిపోయే పడవ లాగా జీవితాన్ని భారంగా మోయకూడదు అది భార్యాభర్తలకు మంచిది కాదు అని దేవమ్మ అంటుంది. గంగ నీకు నల్లపూసల తాళి పండుగ చేద్దాం అనుకుంటున్నాం అని దేవమ్మ అంటుంది. తాళి కట్టిన వాడే నోటికి వచ్చినట్టల అబద్ధం చెప్తుంటే ఇంక నల్లపూసల తాళి పండుగ ఏంటి అత్తయ్య నేను ఏ పండుగ చేసుకునే మూడ్లో లేను అని గంగా అంటుంది. అది కాదు గంగ అని దేవమ్మ అంటుంది. అత్తయ్య మామయ్య గారు షాప్ చూడమని చెప్పారు నేను వెళ్తున్నాను అని గంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,,

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights
Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

రేయ్ గంగ ఒక్కతే వెళ్ళిపోతుంది గంగాధర్ గాడు ఎక్కడికి వెళ్ళాడు రా అని పాండురంగ అంటాడు. ఇంతలో గంగాధర్ వస్తాడురేయ్ గంగాధర్ గంగ ఒక్కతే వెళ్తుందేంట్రా అని సుధాకర్ అంటాడు. అన్నయ్య గంగ కోపం ఇంకా పోలేదు నాతో మాట్లాడటం లేదు అని గంగాధర్ అంటాడు. గంగ కోపం ఇంకా పోలేదా అయితే ఆపరేషన్ కః అని పాండురంగ అంటాడు. అంటే ఏంటి అన్నయ్య అని గంగాధర్ అంటాడు. ఏందిరా పెళ్ళాం కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడటమే అని పాండురంగ అంటారు. నీ ఆపరేషన్ కి ఒక దండం నీకు దండం నాకు ఏది వద్దు గంగా అసలు అలాంటివి పట్టించుకోదు అని గంగాధర్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights
Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

గంగ వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేసి షాప్ పెట్టడానికి ఒక సెట్టర్  చూడమన్నాను కదా ఏమైంది అని అడుగుతుంది. చూస్తున్నాను గంగా కానీ మంచి షాప్ దొరకడం లేదు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. గంగ అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆటోలో వెళుతూ ఉండగా వాళ్ళ అమ్మ వాళ్ళు కనిపిస్తారు ఆటో ఆపి నేను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేసి ఆటో దిగుతుంది గంగ. అమ్మ గంగా నువ్వెప్పుడొచ్చావు అని అంజమ్మ అడుగుతుంది. అమ్మ మీరేంటి ఈ టిఫిన్ బండి పెట్టడమేంటమ్మా అని గంగా ఆశ్చర్య పోతుంది. బ్రతుకు గడవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా గంగా ఏం చేయను పొట్ట గడవడానికి ఏదో ఒక పని చేయాలి రోజు అప్పుల వాళ్ళ తిట్లు వాళ్లకు కట్టే వడ్డీలు తప్ప మా కడుపు నిండడం లేదు అందుకే ఈ టిఫిన్ బండి పెట్టి అప్పులైన కొన్ని తీర్చు వచ్చాను ఇలా బండి పెట్టాము అని వెంకటరమణ అంటాడు. మీ అప్పులు మీ కష్టాలని నేను తీరుస్తానని అన్నాను కదా ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించండి అని గంగా బాధపడుతుంది. అక్క ఈ టిఫిన్ సెంటర్ పెట్టడానికి నేనే సలహా ఇచ్చాను అని వర్ష చెప్తుంది. అమ్మ ఆయనే మోసం చేశాడు అంటే మీరు కూడా నాకు నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తున్నారా మీరు టిఫిన్ సెంటర్ పెట్టడం ఏంటమ్మా అని గంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అల్లుడుగారు మోసం చేయడం ఏంటమ్మా అని వెంకటరమణా అంటాడు. అవును నాన్న పెళ్లి కాకముందు ఆయన నా సర్టిఫికెట్ కొట్టేసి నన్ను మోసం చేసి అబద్ధం చెప్పాడు అసలైన డిగ్రీనే చేయలేదు అని జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది గంగ.

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights
Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

అల్లుడు నిన్ను మోసం చేయడమేంటమ్మా నువ్వు అల్లుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అల్లుడు లాంటి గొప్పవాడు ఇంకెవరూ ఉండరు అమ్మ అల్లుడు చాలా మంచివాడు అని వెంకటరమణ అంటాడు. ఏంటి నాన్న మీరు కూడా ఆయననే సపోర్ట్ చేస్తున్నారు అని గంగా బాధపడుతుంది.అవును గంగా నిన్ను జాబ్ చేయొద్దని మీ మామయ్య గారు మనకు అన్యాయం చేస్తే అల్లుడుగారు మాత్రం మాకు టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి డబ్బులు సహాయం చేశాడు మన పరిస్థితికి వాళ్ల నాన్నే కారణమని ఎంతగానో బాధపడ్డాడు అలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం అమ్మ అని అంజమ్మ అంటుంది.నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని గంగా అంటుంది. సహాయం చేసి మర్చిపోవడం అల్లుడు గొప్పతనం అమ్మ కానీ నిన్ను మోసం చేశాడు అంటున్నావు అదంతా పెళ్లి కాక ముందుకు గంగ అల్లునీ తప్పుగా అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టకు అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights
Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

శ్రీలక్ష్మి గంగ గంగాధర్ మధ్య ఆ సంబంధం ఉందా ఉంటే వాళ్ళు ఇలా గొడవ పడరు శ్రీలక్ష్మి నీకేమైనా తెలుసా అని పాండురంగ అంటాడు. ఈ కాలం పిల్లల్ని మనం ఏం అడగగలమండి అయినా ఆ విషయం నాకెలా తెలుస్తుంది అని శ్రీలక్ష్మి అంటుంది. అందుకే శ్రీలక్ష్మి వాళ్ళిద్దరూ ఒకటి కావాలని ఆపరేషన్ బహ తెచ్చాను అని అంటాడు. ఆపరేషన్ బహనా అదేంటండి అనే శ్రీలక్ష్మి అంటుంది. అంటే ఇది ఒక రకమైన మత్తు పదార్థం శ్రీలక్ష్మి ఇది పాలలో కలిపి ఇస్తే ఇక వాళ్ళిద్రి ని ఎవరు ఆపలేరు కోపాలన్ని మాయమైపోతాయి అని పాండురంగ అంటాడు. ఇది మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామా అని పాండురంగ అంటాడు. నీకెలాంటి బుద్ధులు ఎప్పటినుంచి వస్తున్నాయి అని శ్రీలక్ష్మి చీపిరి కట్ట తెచ్చి పాండురంగనీ కొడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights
Mamagaru Today Episode January 04 2024 Episode 100 Highlights

గంగాధర్ వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.ఇంతలో గంగ వచ్చి ఏమండీ అని పిలుస్తుంది. గంగా పిలిచింది నన్నేనా అనే గంగాధర్ అంటాడు. అవును మిమ్మల్ని కాఫీ తీసుకోండి అN గంగా ఇస్తుంది. ఏంటి గంగ నువ్వు నన్ను అంత ప్రేమగా పిలిచి కాఫీ తెచ్చావా అంటే నా మీద కోపం పోయిందా అని గంగాధర్ సంతోషంతో అంటాడు. చాలా థాంక్స్ అమ్మానాన్నలకి సహాయం చేసినందుకు అని గగా అంటుంది. ఓ అందుకు థాంక్స్ చెప్తున్నావా నామీద కోపం ఇంకా పోలేదా అని గంగాధర్ అంటాడు. ఎలా పోతుందండి మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలని నేను బ్యాంకులో చుట్టూ లోన్ కావాలని తిరుగుతున్నప్పుడైనా మీరు నిజం చెప్పాలి కదా చెప్పకుండా దాచేసినందుకు కోపం రాదా నాకు కోపం పోగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి అని గంగా అంటుంది. అలాగా గంగా చేస్తాను అనే గంగాధర్ కాఫీ తాగుతూ గంగా ఈ కాఫీ చాలా సూపర్ గా ఉంది అని అంటాడు..

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N