NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందజేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Chandrababu Pawan Kalyan: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తో కలిసి చంద్రబాబు హజరైయ్యారు. సీఈసీ రాజీవా కుమార్ ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు అపహాస్యంగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యదు చేశామని చంద్రబాబు తెలిపారు. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతలకలు జరిగాయని అన్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అయ్యాయని, దొంగ ఓట్లు నమోదు చేయించారని అన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. ఆరు నుండి ఏడు వేల మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, అలానే ఇక్కడ కూడా జరగాలని కోరారు.

సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈసీకి పిర్యాదు చేశామన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని కోరారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. బీఎల్వో లుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారని చెప్పారు. అవసరమైతే కేంద్ర పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని కోరారు. ప్రజాస్వామ్యం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశామన్నారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఇక్కడ ఓటు ఇవ్వాలని ఆయన కోరారు.

అక్రమాలకు పాల్పడిన ప్రతి అధికారిపై తాము ఆధారాలతో సహా వారికి అందించామనీ, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం తక్షణం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని చంద్రబాబు తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో లక్షకుపైగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెరిగిపోయాయని అన్నారు.

ప్రతిపక్షాల వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. తమ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్చగా జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవా కుమార్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైసీపీ నుండి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ నుండి చంద్రబాబు, జనసేన నుండి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, అప్ నేతలు హజరైయ్యారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సన్నద్దత, ఓటర్ల జాబితాపై సీఈసీ సమీక్ష నిర్వహించింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం .. ఎమ్మెల్యేలు కుషీ .. ఎందుకంటే.. ?

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N