NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Vs YS Sharmila: షర్మిలకు సజ్జల సూటి ప్రశ్నలు

Sajjala Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు పలు సూటి ప్రశ్నలు వేశారు.

షర్మిల వాడిన భాష, యాస పై సజ్జల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్దిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం వైఎస్ జగన్ పై పెట్టినవి అక్రమ కేసుని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాదే చెప్పారన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు సజ్జల. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏమి తెలుసునని ప్రశ్నించారు. తెలంగాణ నుండి ఏపీకి హఠాత్తుగా షర్మిల ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందనీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయనీ, ఇప్పుడు ఆ పార్టీ తరపున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదన్నారు. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేసారని ప్రశ్నించారు. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని అన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని పేర్కొన్నారు. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజాన ఎత్తుకుందని అన్నారు. చంద్రబాబు కుట్రలో షర్మిలను చివరి అస్త్రంగా ప్రయోగించారని అన్నారు సజ్జల.

గతంలో చంద్రబాబుతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని సజ్జల అన్నారు. ప్రత్యేక హోదా ను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి మేలు చేస్తున్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడరని చెప్పారు. వైఎస్ఆర్ తనయగా, వైఎస్ జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామన్న పేర్కొన్న షర్మిల..టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తొందని అన్నారు.

YS Sharmila: 175 నియోజకవర్గాల్లో పోటీకి ‘సై’ అంటున్న షర్మిల .. ఏపీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఎప్పటి నుండి అంటే..?

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N